Begin typing your search above and press return to search.

సారీ జగన్ అంటూ గట్టిగా వేసుకున్న ఎంపీ...

By:  Tupaki Desk   |   12 Dec 2022 3:42 PM GMT
సారీ జగన్ అంటూ గట్టిగా వేసుకున్న ఎంపీ...
X
ఏపీ సీఎం జగన్ ప్రభుత్వం గ్రౌండ్ లెవెల్ లో ఏ రకంగా పాలనలో విఫలం అవుతుందో కళ్లకు కట్టినట్లుగా చూపించారు సీపీఐ కి చెందిన రాజ్యసభ సభుడు బినయ్ విశ్వం. ఆయన మాండూస్ తుపానుని ఏపీలో ఎదుర్కొనే విషయంలో జగన్ సర్కార్ అట్టర్ ఫ్లాప్ అయిందని తేల్చేశారు. తాను జగన్ సొంత జిల్లా కడపలోనే ఉండి అన్నీ చూశానని మాండూస్ తీవ్రంగా ప్రభావం చూపించిన జిల్లాలలో కడప ఒకటి అని ఆయన పేర్కొన్నారు. అయినా అధికారులు మాత్రం ఎక్కడికీ కదలకుండా ఉండిపోయారని, జనాలను మాండూస్ బారిన వదిలేశారు అని ఆయన దుయ్యబెట్టారు.

ఈ మేరకు ఈ నెల 10న డేట్ తో సీఎం జగన్ కి ఆయన నేరుగా రాసిన లేఖ ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సారీ జగన్ అంటూనే ఆయన గట్టిగా వేసుకున్నారు. మీ సొంత జిల్లాలో నేను ఉన్నాను, అక్కడ తుపాను భీభత్సాన్ని కళ్లారా చూసాను, అయినా కూడా ప్రభుత్వ యంత్రాంగంలో స్పందన లేదు. కలెక్టర్ ఆఫీస్ కి ఫోన్ చేసినా మేసేజ్ పెట్టినా కూడా రియాక్షన్ లేదని ఆయన మండిపడ్డారు.

పాపం తుపానుకు సెకండ్ సాటర్ డే అని తెలియదు అందుకే తరుముకుని వచ్చింది. కానీ అధికారులకు మాత్రం సెలవు కాబట్టి జనాలు బలి అయిపోయారు అని ఆయన ఘాటైన విమర్శలు చేశారు. ఈసారి తుపాను వస్తే కనుక ప్రభుత్వ ఆఫీసుల్లో అధికారుల వర్కింగ్ డేస్ లో రమ్మని చెబుతామని ఆయన సెటైర్లు వేశారు. ఒక వైపు సహాయ చర్యలు తీసుకోమని జగన్ అధికారులను ఆదేశించినట్లుగా వార్తలను చూసి తాను ఏదో జరిగిపోతోందని అనుకున్నాను కానీఎ గ్రౌండ్ లెవెల్ రియాల్టీస్ మాత్రం దారుణం అంటూ సీపీఐ ఎంపీ విరుచుకుపడ్డారు.

తుపాను విషయంలో ప్రభుత్వం ఏ రకమైన ముందస్తు చర్యలు తీసుకోలేదని, తాను అనేక ప్రాంతాలలో పర్యటించడంతో ఈ విషయం బయటపడింది అని ఆయన అన్నారు. మరో వైపు చూస్తే తాను కడప రావడానికి కూడా కారణం ఉందని, అది మీరు ఇచ్చిన మూడేళ్ళ క్రితం నాటి హామీ నెరవేరకపోవడమే అని సీపీఐ ఎంపీ జగన్ మీద ఫైర్ అయ్యారు. 2019 డిసెంబర్ 21న జగన్ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారని, కానీ నేటికీ అతీ గతీ లేదని, అందుకే తమ పార్టీ నేతలతో పాదయాత్ర కోసం తాను రావడం జరిగిందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.

తీరా వచ్చాక మాండూస్ తుపాను వణికించిందని, అయితే ఆ తుపాన్ పుణ్యమని ప్రభుత్వ అసమర్ధతను కూడా చూడడం జరిగిందని ఆయన మండిపడ్డారు. మొత్తానికి చూస్తే జగన్ పాలనలోని డొల్లతనాన్ని సీపీఎం ఎంపీ ఏకి పారేశారు అని అంటున్నారు. ఈ విషయంలో ఆయన వైసీపీ ప్రభుత్వం చెప్పే దానికీ జరిగే దానికీ కూడా ఎక్కడా పొంతనా పోలికా లేవని ఘాటుగా కామెంట్స్ చేశారు. ఈ లెటర్ ని సోషల్ మీడియాలో పెట్టిన తెలుగుదేశం పార్టీ పాలన అంటే జగన్ బటన్ నొక్కడమే అని అనుకుంటున్నారు అని ఎద్దేవా చేసింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.