Begin typing your search above and press return to search.
వైసీపీ ఎంపీకి స్వీట్ గా ఆ సీటు... ?
By: Tupaki Desk | 31 March 2022 3:30 AM GMTఎంపీగా ఢిల్లీ వెళ్లాలని కొందరికి కోరిక ఉంటుంది. అందుకే వారు ఎపుడూ ఎంపీగా పోటీ చేయాలనుకుంటారు. కొందరు మాత్రం ఎందుకొచ్చిన ఢిల్లీ అంటారు. హ్యాపీగా ఉన్న చోటే ఎమ్మెల్యే అయి లక్ గట్టిగా తగిలితే మంత్రి కుర్చీలో కూర్చోవాలని ఉబలాటపడతారు. అలాంటి వారిలో విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మొదటి వరసలోనే ఉన్నారు. ఈయన సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణకు బంధువే. బొత్స చలువతోనే ఇప్పటిదాకా అనేక పదవులు చేపట్టారు.
ఇక ఎమ్మెల్యే కావాలన్నది ఆయన చిరకాల కోరిక. ఆయన సొంత సీటు చీపురుపల్లి. కానీ అక్కడ దాన్ని బొత్స సొంతం చేసుకోవడంతో బెల్లాన తనకు సరైన సీటు ఏదీ అని బాగానే సెర్చ్ చేస్తున్నారు. ఈసారి ఆరు నూరు అయినా ఎమ్మెల్యేగానే పోటీ అని కూడా ఆయన గట్టిగా డిసైడ్ అయ్యారు. ఈ నేపధ్యంలో ఆయనకు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల అసెంబ్లీ సీట్లో వైసీపీ వర్గ పోరు బాగా కలిసివస్తోంది.
ఎచ్చెర్ల విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఉంది. దాంతో ఎంపీగా ఆయన ఇప్పటికే మూడేళ్ళుగా అక్కడ బాగా తిరుగుతున్నారు. ఎచ్చెర్లలో ఆయనకు విశేషంగా బంధుగణం ఉంది. అదే విధంగా ఆయన సొంత ప్రాంతం చీపురుపల్లికి కూడా దగ్గర. చీపురుపల్లి ఎచ్చెర్లలోని లావేరు. జీ సిగడం మండలాలు చాలా దగ్గర. మరో వైపు చూస్తే ఈ మండలాలతో పాటు ఎచ్చెర్ల, రణస్థలం మండలాలలో బెల్లానకు గట్టి మద్దతుదారులు ఉన్నారు.
ఎచ్చెర్ల నియోజకవర్గం తూర్పు కాపుల ప్రాబల్యం ఉన్న సీటు. బెల్లాన కూడా అదే సామాజికవర్గానికి చెందిన వారు. ఇలా అన్ని ఈక్వేషన్లు ఆయనకు కలసివస్తున్నాయి. మరో వైపు చూస్తే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ మీద సొంత పార్టీలోనే తిరుగుబాటు మొదలైంది. ఆయనకు మళ్లీ టికెట్ ఇస్తే ఓడించి తీరుతామని వైసీపీ అసమ్మతి నేతలు తెగేసి చెప్పేస్తున్నారు. తమకు వైసీపీ అంటే ఇష్టమే కానీ గొర్లె అంటే మాత్రం కుదిరే పని కాదని వారు అంటున్నారు.
గొర్లెకు బదులుగా ఎవరిని తెచ్చి ఎమ్మెల్యే అభ్యర్ధిగా చేసినా కళ్ళు మూసుకుని మద్దతు ఇస్తామని అంటున్నారు. ఈ పరిణామాలే బెల్లానలో ఆశలు రేపుతున్నాయి. ఇక ఎంపీగా ఆయనకు ఎచ్చెర్ల వైసీపీ నేతలు అంతా టచ్ లో ఉన్నవారే. దాంతో ఆయన వారితో మంతనాలు జరుపుతున్నారని తెలుస్తోంది.
మరో వైపు ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి కూడా హై కమాండ్ కి అభ్యంతరాలు ఉండవు. బొత్స మద్దతు ఎటూ ఉంటుంది. ఎంపీగా గెలిచిన అనుభవం ఉంది. దాంతో పాటు అర్ధ బలం కూడా ఉంది. ఇక చూస్తే ఎచ్చెర్ల సీటు లో ఎమ్మెల్యే మీద వ్యతిరేకత జనాల్లో కూడా ఉన్నట్లుగా సర్వే నివేదికలు హై కమాండ్ వద్ద ఉన్నాయని అంటున్నారు.
ఈ మొత్తం పరిణామాలు చూస్తే ఎచ్చెర్ల సీటు ఇపుడు బెల్లానకు స్వీట్ గా మారుతోంది అంటున్నారు. తనకు సరైన స్థావరంగా దాన్ని మార్చుకోవడానికి ఆయన చూస్తున్నారు. రానున్న రెండేళ్ళూ ఆయన ఎచ్చెర్లలోనే ఫుల్ ఫోకస్ పెట్టేస్తారు అంటున్నారు. సో గొర్లెకు టికెట్ హుళక్కేనా, ఆయన వన్ టైం ఎమ్మెల్యేనా అంటే ఏమో చూడాల్సిందే.