Begin typing your search above and press return to search.
ఎంపీ అవినాష్ మాతృమూర్తి హెల్త్ బులెటిన్ విడుదల.. వైద్యులు ఏమన్నారంటే..
By: Tupaki Desk | 22 May 2023 1:59 PM GMTకడప ఎంపీ, వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డి మాతృమూర్తి కర్నూలు జిల్లాలోని విశ్వభారతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి తాజాగా ఆసుపత్రి వర్గాలు ఆమె హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. ఆమె ఆరోగ్యం విషమంగానే ఉందని.. బీపీ ఇంకా కంట్రోల్‌లోకి రాలేదని పేర్కొన్నారు. మరికొన్ని రోజులపాటు ఆమె ను ఐసీయూలోనే ఉంచాల్సిన పరిస్థితి ఉందని పేర్కొన్నారు.
24 గంటలూ వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలిపారు. కానీ, నిస్సత్తువతో పాటు మగతలో ఉంటున్నారని తెలిపారు. ఇప్పటికే ఒకసారి గుండె పోటు వచ్చిందని, ప్రస్తుతం పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని డాక్టర్లు చెప్పారు.
లక్ష్మికి యాంజియోగ్రామ్ టెస్టు చేయగా.. గుండెలో రెండో చోట్ల బ్లాక్‌లు ఉన్నాయని తేలిందని, పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఆమెను మరిన్ని రోజులు ఐసీయూలోనే ఉంచి చికిత్స అందించాల్సి ఉందని బులెటిన్‌లో పేర్కొన్నారు.
సీబీఐకి అవినాష్ లేఖ
ఇక, తనను ప్రశ్నించేందుకు కర్నూలుకు వచ్చిన సీబీఐ అధికారులకు ఎంపీ అవినాష్ రెడ్డి ఇదే విషయాన్ని పేర్కొంటూ లేఖ రాశారు. ''మా లక్ష్మి(67) తీవ్ర అస్వస్థతకు గురయి, ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతోంది. బ్లడ్ ప్రెషర్‌తో పాటు హైపర్ టెన్షన్ ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ప్రస్తుతం కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ప్రస్తుతం మా నాన్నా భాస్కరరెడ్డి జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న విషయం మీకు తెలిసిందే. మా తల్లితండ్రుల బాగోగులను చూసుకోవాల్సిన బాధ్యత ఒక్కగానొక్క కొడుకయినా నాపై ఉంది.
ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో అమ్మకు తోడుగా ఉండి ఆమె ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. పై పరిస్థితుల దృష్ట్యా నాకు 7 రోజుల గడువు కావాలని కోరుతున్నాను. అమ్మ ఆరోగ్యం కుదుటపడగానే మీ ముందు విచారణకు హాజరు కాగలను'' అని అవినాష్ రెడ్డి సిబిఐకి ఇచ్చిన లిఖిత పూర్వక జవాబులో పేర్కొన్నారు.