Begin typing your search above and press return to search.
ఎంపీ అరవింద్ కు షర్మిల కౌంటర్ లేదే..!
By: Tupaki Desk | 29 March 2021 1:30 PM GMTరాజకీయాల్లో ఆర్థిక బలంతో పాటు మాట బలం కూడా ఉండాలి. ఎదుటివారి విమర్శలను తప్పికొట్టేందుకు నైపుణ్యంగా వ్యవహరించాలి. లేకపోతే ప్రజల్లో చులకన అయిపోతారు. అప్పుటు ఆ రాజకీయ నాయకుడు ఏ విధంగా ఆకర్షితుడు కాలేదు. ఈ విషయం ఎందుకు వచ్చిందంటే.. తెలంగాణలో రాజకీయ వేడిని పెంచిన షర్మిల పార్టీ పెట్టడంలో ఇంకా క్లారిటీ రాకపోయినా ఆమెకు అభిమానులు మాత్రం పెరుగుతున్నారు. రోజుకో జిల్లా నుంచి వైఎస్ అభిమానులను కలుస్తూ వారితో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇదంతా పార్టీ కోసమే అని అనుకుంటున్నా.. ఆమె మాత్రం తెలంగాణలో ఏదో చేద్దామని తాపత్రయపడుతున్నారు.
వైఎస్ షర్మిల పార్టీపై తెలంగాణలో అధికార టీఆర్ఎస్, ఇతర ప్రతిపక్షాలు ఏ విధంగానూ స్పందించలేదు. షర్మిల మాత్రం టీఆర్ఎస్ తో సహా అన్ని పార్టీల నాయకులపై విరుచుకుపడుతోంది. ఇటీవల నిజమాబాద్ వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పసుపు బోర్డు విషయంలో ఆమె ఎంపీ అరవింద్ పై విమర్శలు చేశారు. దీంతో ఆ విమర్శలకు ఎంపీ కౌంటర్ ఇచ్చాడు. అయితే ఆ కౌంటర్ కు ఎన్ కౌంటర్ ఇవ్వడంలో మాత్రం షర్మిల వెనుకడుగు వేశారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
అయితే ఒకరిపై విమర్శలు చేసేటప్పుడు, కౌంటర్లు వస్తాయని ఊహించాలి.ఆ కౌంటర్లకు ఎన్ కౌంటర్ వేయడానికి సరైన వాగ్ధాటి ఉంటే అప్పుడు పార్టీకైనా, ఆ రాజకీయ నాయకుడికైనా ప్రజల్లో ఆకర్షణ పెరుగుతుంది. ఇక ఎంపీ అరవింద్ కు ఎనకౌంటర్ జవాబు ఇవ్వడానికి షర్మిల దగ్గర సరైన నాయకుడు లేడు. ప్రతీ కౌంటర్ కు షర్మిల స్వయంగా ఎన్ కౌంటర్ ఇవ్వలేదు. అందువల్ల రివర్స్ పంచ్ లేసే వారిని నియమించుకోవాలని కొందరు సూచిస్తున్నారు.
ఇక షర్మిల రోజుకో జిల్లా నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నా పెద్దగా ఫోకస్ అవ్వడం లేదు. అమె అన్న చానెల్ అయిన సాక్షిలో కూడా అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తోంది. అంతో ఇంతో టీడీపీకి చెందిన మీడియానే షర్మిల వార్తలను కవర్ చేస్తుంది. అయితే అది షర్మిలపై ఉన్న అభిమానంతో కాకుండా జగన్ పై ఉన్న వ్యతిరేకతతో అని అంటున్నారు.
ఒకరు విమర్శలు చేస్తే..మనం దానికి ప్రతి విమర్శలుగా కౌంటర్లు ఇస్తే మీడియా ఫోకస్ చేస్తుంది. అప్పుడు పరోక్షంగా హైలెట్ అవుతారు. అందువల్ల పాతకాలం వారిని కాకుండా సరైన వాగ్ధాటి నాయకులను తమ దగ్గర నియమించుకుంటే బెటరని విశ్లేషకులు సూచిస్తున్నారు.