Begin typing your search above and press return to search.

కరోనాకు మరో ఎంపీ బలయ్యాడు

By:  Tupaki Desk   |   2 Dec 2020 4:07 AM GMT
కరోనాకు మరో ఎంపీ బలయ్యాడు
X
వణికిస్తున్న కరోనా ధాటికి ఇప్పటికే పెద్ద ఎత్తున మరణాలు చోటు చేసుకున్నాయి. సెలబ్రిటీలు.. ప్రముఖులు మొదలు సామాన్యుల వరకు ఎంతో మంది ప్రాణాలు పోయిన పరిస్థితి. తాజాగా ఈ జాబితాలో అధికారపార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు చేరారు. కరోనా వైరస్ బారిన పడి ఎంపీ అజయ్ భరద్వాజ్ కన్నుమూశారు. దేశంలో మహమ్మారి తీవ్రత తగ్గిందని చెబుతున్నా.. మరోవైపు మరణాలు ఆగటం లేదు కొత్త కేసుల నమోదు జోరు కనిపిస్తోంది.

సెకండ్ వేవ్ ప్రమాద సంకేతాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నట్లుగా చెప్పక తప్పదు. గుజరాత్ కు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యులు అభయ్ భరద్వాజ్.. ఆగస్టులో కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయన్ను రాజకోట్ లోని ఆసుపత్రికి తరలించి.. వైద్యం చేస్తున్నారు. ఆయనకు తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్య తలెత్తింది. దీంతో.. ఆయనకు మెరుగైన వైద్యం అందించేందుకు ఎయిర్ అంబులెన్సులో చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు.

బ్యాడ్ లక్ ఏమంటే.. ఇంత ప్రయత్నం చేసినా.. ఆయన్ను కాపాడుకోలేని దుస్థితి. పరిస్థితి మెరుగుపడకపోవటంతో చికిత్స వేళ.. ఆయన కన్నుమూశారు. ఈ మధ్యనే కాంగ్రెస్ సీనియర్ నేత.. సోనియాగాంధీ కుటుంబానికి సన్నిహితుడైన అహ్మద్ పటేల్ కరోనాతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇది జరిగి వారం కూడా కాకముందే..రాజ్యసభకు చెందిన మరో ఎంపీ కన్నుమూసిన వైనం షాకింగ్ గా మారింది. మరో కీలక అంశం ఏమంటే.. ఈ ఇద్దరు రాజ్యసభ నేతలు గుజరాత్ కు చెందిన వారే కావటం. రాజ్ కోట్ కు చెందిన ఈ సీనియర్ న్యాయవాదిని ఈ జులైలో నియమించారు. అంతలోనే ఆయన కరోనా కారణంగా బలయ్యారు. ప్రధాని మోడీ ఆయన మరణానికి సంతాపాన్ని తెలియజేశారు.