Begin typing your search above and press return to search.
శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తున్న శివలింగం!
By: Tupaki Desk | 13 Oct 2016 10:30 PM GMTశివలింగాలను - జోతిర్లింగాలను దర్శించుకోవడం చాలా మంది హిందువులకు పరిపాటే. శివలింగాలకు పూజలు చేయడం చాలా కాలం నుండి వస్తున్న ప్రాచీన ఆచారమే. దాదాపు శివలింగాలన్నీ నల్లని రాతి రూపంలోనే పూజలు అందుకుంటుంటాయనేదీ తెలిసిన విషయమే. శివలింగం శివుడిని సూచించే ఒక పవిత్ర చిహ్నం. అయితే ఇప్పటివరకూ ఎవరు ఎన్ని శివలింగాలు చూసినా, ఇప్పుడు చెప్పబోయే శివలింగం మాత్రం వాటన్నింటికీ భిన్నమైంది! ఎందుకంటే ఇది కదిలే శివలింగం!!
ఉత్తరప్రదేశ్ లోని రుద్రపూర్ లో ఎన్నో కోటలు - రాజభవంతులూ ఉన్నా, ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది మాత్రం దుగ్దేశ్వరనాథ్ ఆలయమనే చెబుతుంటారు. ఎందుకంటే ఆ ఆలయానికున్న ప్రత్యేకతలు అలాంటివట. ఈ ఆలయంలోనే వాటంతటవే ఉద్భవించే "స్వయంభూ శివలింగం" ఏర్పడిందని.. స్వయంభూ లింగం ఆలయంలోని శివలింగం పానమట్టము మీద కాకుండా సరాసరి భూమి మీదనే ప్రతిష్టించబడింని చెబుతున్నారు. ఇదే క్రమంలో... రెండువేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయం లో శివలింగం చాలాసార్లు కదులుతుందని, దాన్ని చూసేందుకు జనం తండోపతండాలుగా వస్తుంటారనీ అంటున్నారు. అయితే అప్పుడప్పుడూ ఈ శివలింగం కదలడం మొదలుపెడుతుందట... అలా ఒక్కసారి కదలడం మొదలైతే ఒక్కోసారి గంట - రెండు గంటలు మరికొన్ని సార్లు రోజంతా అలా కదులుతూనే ఉంటుందట. అక్కడి పూజారులే స్వయంగా ఈ విషయాన్ని చెబుతుంటారు.
అయితే ఈ కదిలే శివలింగం అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు గుంపులు గుంపులుగా వస్తుంటారు. అయితే ఈ శివలింగం దానికదే కదలాలి తప్ప ఒకరు కదిలిస్తే కదలదట. ఎందుకంటే... ఈ శివలింగం ఒక్కసారి కదలటం ఆగిపోయాక ఎంత కదిలిచ్చినా కదలదట! అయితే అసలు ఈ శివలింగం కథేమిటి.. కదలడం ఏమిటి.. ఎందుకు కదులుతుంది.. అనే విషయాలను తెలుసుకోవడానికి చాలా మంది పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు కూడా జరిపారట. అయితే ఆ శివలింగం చుట్టూ ఎంత తవ్వినా శివలింగం పొడవు కనిపిస్తుందే తప్ప ఇప్పటి వరకూ వాళ్లకు కూడా అసలు విషయం తెలియలేదట. శాస్త్రవేత్తల సంగతి అలా ఉంచితే... భక్తులు మాత్రం ఆ శివుడే ఇక్కడ కొలైవున్నాడని చాలా గట్టిగా నమ్ముతారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/