Begin typing your search above and press return to search.

సినిమా చూడాలంటే..థియేటర్ రంగు చూడాలి!

By:  Tupaki Desk   |   31 Aug 2015 3:46 AM GMT
సినిమా చూడాలంటే..థియేటర్ రంగు చూడాలి!
X
సినిమాకి వెళ్లాలని నిర్ణయించుకుని ఏ సినిమాహాలులో టిక్కెట్లు దొరికితే ఆ హాలుకి వెళ్లిపోదాం... టిక్కెట్లు దొరకడం ముఖ్యంకానీ... థియేటర్ ది ఏముందిలే అని అనుకుంటున్నారా? ఇకపై ఆ ఛాన్సు లేదు! సినిమా చూసి.. సినిమా హాలు మల్టీప్లెక్సా, ఐమాక్సా, 70ఎంఎం ఆ వంటివి మాత్రమే చూస్తే సరిపోదు... "రంగు"కూడా చూడాలి! రంగు చూసి ఆ థియేటర్ పై ఒక క్లారిటీ తెచ్చుకుని అప్పుడు సినిమా చూడటానికి లోపలికి వెళ్లాలి.

విషయానికి వస్తే... సినిమా చూసి సేఫ్ గా బయటకు రావాలి అంటే... సినిమా మాత్రమే బాగుంటే సరిపోదు, సినిమా హాలు కూడా బాగుండాలి! తాజాగా టి.ప్రభుత్వం ఈ మేరకు "రంగు"నిర్ణయాలు తీసుకుంది! ఈ నిర్ణయం ప్రకారం.. ప్రతీ థియేటర్ వద్దా తెలంగాణ ఫైర్ సర్వీస్ ఒక రంగు వేస్తుంది. ఆ సినిమా థియేటర్ లో ఉన్న ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఆధారంగా ఈ రంగు నిర్ణయించబడుతుంది. ఇవి ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉంటాయి!

మీరు వెళ్లాలనుకున్న థియేటర్ కు ఆకుపచ్చ కలర్ ఉంటే... మీరు దైర్యంగా సినిమా చూడటానికి వెళ్లొచ్చన్న మాట. అంటే.. ఆ థియేటర్ పూర్తిగా అగ్నిప్రమాద రహితంగా ఉందని అర్ధం. ఒకవేళ పసుపు రంగు ప్రత్యక్షమైతే... పాక్షికంగా సురక్షితం అని అర్ధం. అలాకాకుండా ఎరుపు రంగు ఉంటే మాత్రం... ఆ థియేటర్ లో సినిమా చూసేవారి "ఎంటర్ యువర్ ఓన్ రిస్క్" కు లోబడే వెళ్తున్నట్లు లెక్క. అంటే... ఆ థియేటర్ అగ్ని ప్రమాదాలు సంబవించినప్పుడు ఏమాత్రం సురక్షితం కాదు అని అర్ధం. అంటే... ఇకపై సినిమా చూడాలంటే... ముందుగా సినిమా హాలు రంగు చూడాలన్నమాట!