Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల మూత?

By:  Tupaki Desk   |   14 March 2020 5:30 AM GMT
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల మూత?
X
ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ వల్ల ఇప్పటికే వాణిజ్య - పారిశ్రామిక రంగాలు కుదేలయ్యాయి. అనేక ప్రాంతాల్లో పర్యాటక రంగం వెలవెలబోతోంది. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ టాలీవుడ్‌ పై కూడా భారీగా పడేట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో కూడా థియేటర్లు - మాల్స్ బంద్ ప్రకటించే అవకాశం వున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. థియేటర్ల విషయంలో ఎగ్జిబిటర్ల చాంబర్ స్వచ్ఛందంగా ఈ నిర్ణయం తీసుకునే అవకాశం వున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి.

తెలంగాణ - ఏపీలో కరోనా కేసు నమోదైన నేపథ్యంలో ప్రజలు బయట తిరగడానికే భయపడుతున్నారు. ప్రయాణాలు కూడా మానుకుంటున్నారు. ప్రభుత్వం కూడా వైరస్ వ్యాప్తి చెందకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే సినిమా థియేటర్లను కొద్ది రోజులు మూసేయ్యాలని చిత్రపరిశ్రమ భావిస్తోందట. ఇప్పటికే థియేటర్స్ లో జనాలు తగ్గిపోయారు. ఇలాంటి నేపథ్యంలో థియేటర్ల నిర్వహణ కూడా భారంగా మారుతుంది. అందువల్ల అన్ని విధాలా కలిసి వచ్చేలా ఒక పది రోజుల పాటు లేదా వారం పాటు థియేటర్లను బంద్ చేసే ఆలోచనలో ఇండస్ట్రీ పెద్దలు ఉన్నట్టు తెలుస్తుంది.

దీనితో ముందుగా అనుకున్న సినిమాలు కూడా వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని కొత్త సినిమాల రిలీజ్ డేట్స్ మార్చుకున్నట్టు సమాచారం. అధికారికంగా ప్రకటించకపోయినా, ఈ మేరకు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇకపోతే, కరోనాకు భయపడి చాలా మంది సినీ హీరోలు, ప్రముఖులు ఇప్పటికే షూటింగ్‌ లు రద్దుచేసుకుంటుంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని సినిమా థియేటర్లు కూడా తాత్కాలికంగా మూతపడనున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.