Begin typing your search above and press return to search.
అఖిలప్రియ అరెస్ట్ పై మౌనిక సంచలన వ్యాఖ్యలు
By: Tupaki Desk | 8 Jan 2021 7:50 AM GMTతన అక్క. టీడీపీ మాజీ మంత్రి అఖిలప్రియను కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేయడంపై భూమా మౌనిక స్పందించింది. అఖిలప్రియ పట్ల పోలీసులు దారుణంగా ప్రవర్తించారని వాపోయింది. అఖిలప్రియ గాంధీ ఆస్పత్రిలో పడిపోయినా ఎవరూ పట్టించుకోలేదని.. లేడి కానిస్టేబుళ్లు సైతం స్పందించలేదని మౌనిక విమర్శలు చేసింది.
అఖిలప్రియ తలకు దెబ్బ తగలడం వల్ల అప్పుడప్పుడు ఫిట్స్ వస్తుంటాయని..న్యూరో సర్జన్ అవసరం అని చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని మౌనిక తెలిపింది.
ఫిట్ గా ఉందంటూ పోలీసులు ఆమెను తీసుకెళ్లి నిర్లక్ష్యంగా మాట్లాడారని మౌనిక మండిపడింది. అఖిలప్రియ అరెస్ట్ వెనుక రాజకీయ ఒత్తిళ్లు కూడా ఉండొచ్చని మౌనిక పేర్కొంది.
అఖిలప్రియ ఎవరిని డబ్బులు డిమాండ్ చేయలేదని.. రిమాండ్ రిపోర్ట్ లో ఉన్నది కరెక్ట్ కాదంటూ మౌనిక పేర్కొంది.
కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసులో మొదట అఖిలప్రియను ఏ2గా పేర్కొన్న పోలీసులు ఇప్పుడు ఏ1గా మార్చారు. ఈ క్రమంలోనే తన అక్క అమాయకురాలు అని చెల్లులు మౌనిక వాపోయింది.