Begin typing your search above and press return to search.

అన్ని పార్టీలకు చెమలు పట్టిస్తున్న ఒక్కడు

By:  Tupaki Desk   |   13 Oct 2018 11:01 AM GMT
అన్ని పార్టీలకు చెమలు పట్టిస్తున్న ఒక్కడు
X
తెలంగాణాలో ఎన్నికల సమరం నువ్వా నేనా అన్నట్టు సాగుతుంది. గెలిచే అభ్యర్థులను మాత్రమే బరిలోకి దింపి, ఓటింగ్ ను సామాజిక వర్గాల వారీగా బేరీజు వేసుకుంటుండగా, నేను గెలవలేకపోయినా ఫర్వాలేదు.. మీ గెలుపును శాసిస్తా అంటున్నారు మోత్కుపల్లి నరసింహులు. సీనియర్ నేత, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయన నల్గొండ జిల్లా ఆలేరు నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు.

ఆలేరు నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిగ్ గా మారింది. ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు మోత్కుపల్లి నరసింహులు స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇక్కడ గెలుపొందింది. గొంగిడి సునీత ఇక్కడ నుంచి విజయం సాధించారు. ఈమెకే ఈ సారి కూడా టిక్కెట్టు కేటాయించారు. ఇక, కాంగ్రెస్ నుంచి బూడిద భిక్షమయ్య గౌడ్ పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు.

నిన్న మొన్నటి వరకు టీడీపీలోనే కొనసాగిన మోత్కుపల్లి నరసింహులు పార్టీ అధినేత చంద్రబాబును బహిరంగంగా విమర్శించి బహిష్కరణకు గురయ్యారు. ఆ తరువాత టీఆర్ఎస్ లో చేరాలనుకున్న కుదరలేదు. కాంగ్రెస్ లో అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆయన స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.

ఆలేరులో మోత్కుపల్లికి బలమైన క్యాడర్ ఉంది. ఇక్కడ నుంచి ఆయన 6 సార్లు విజయం సాధించారు. మోత్కుపల్లి పోటీతో అటు టీఆర్ఎస్, ఇటు టీడీపీ ఓటర్లలో భారీగా చీలిక వస్తుందేమోనని ఇరు పార్టీలు మదనపడుతున్నాయి. ఎక్కడ రెండో స్థానంలో నిలిచి పరువు పోగొట్టుకోవాల్సి వస్తుందోనని టీఆర్ఎస్ మదనపడుతుంగా, గెలుపే లక్ష్యంగా ఉన్న తమకు మెజార్టీ సీట్లు రాక చతికిలపడతామేమోనని కాంగ్రెస్ కలవరపాటుకు గురవుతుంది. మొత్తానికి అధికార , ప్రతిపక్షాలకు ఈ ఒక్కడి పోటీ ఇప్పుడు నిద్ర లేకుండా చేస్తోందట..