Begin typing your search above and press return to search.

మదనపల్లె తరహా మరో ఘటన అల్లా మెప్పు కోసం కొడుకుని బలిచ్చిన తల్లి !

By:  Tupaki Desk   |   8 Feb 2021 12:15 PM GMT
మదనపల్లె తరహా మరో ఘటన అల్లా మెప్పు కోసం కొడుకుని బలిచ్చిన తల్లి !
X
మూఢనమ్మకాలతో న్నబిడ్డలనే చేజేతులా చంపుకుంటున్న ఘటనలు ఇటీవల కాలంలో చోటుచేసుకుంటున్నాయి. విద్యావంతులు సైతం అంధ విశ్వాసంలో కూరుకుపోతున్నారు. ఇటీవల మదనపల్లెలో అలేఖ్య, దివ్య ఉదంతం కూడా ఈ కోవలోదే. తాజాగా, కేరళలో ఓ మహిళ తన ఆరేళ్ల కుమారుడ్ని దేవుడి పేరుతో బలితీసుకుంది. ఈ ఘటన పాలక్కడ్ జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే .. కేరళలోని పాలక్కాడ్ లోని పుత్తుపల్లి రోడ్డులో సులేమాన్, షాహినా అనే దంపతులు నివాసం ఉంటున్నారు. సులేమాన్, షాహీనా దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. సేలేమాన్, షాహినా దంపతుల ముగ్గురు పిల్లల్లో అదిల్ అనే కొడుకు చివరివాడు. షాహీనా చాలా కాలం నుంచి పాలక్కాడ్ లోని ఓ ప్రముఖ మదరసాలో టీచర్ గా ఉద్యోగం చేస్తోంది. షాహీనా ప్రస్తుతం గర్బవతి. సులైమాన్ ట్యాక్సీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. షాహీనాకు దైవభక్తి చాలా ఎక్కువ. దానికితోడు మదరసాలో టీచర్ గా ఉద్యోగం చేస్తున్న షాహీనా నిత్యం అక్కడ చదువుకునే పిల్లలకు దేవుడి గురించి, దేవుడి మహిమల గురించి భోదిస్తోంది.

రాత్రి భోజనం చేసిన తరువాత సులైమాన్ ఇద్దరు పిల్లలతో కలిసి ఓ గదిలో నిద్రపోయాడు. లేడీ టీచర్ షాహీనా, ఆమె చిన్న కొడుకు అదిల్ మరో గదిలో నిద్రపోయారు. వేకువ జామున నాలుగు గంటల సమయంలో షాహీనా ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం కన్న కొడుకు అదిల్ ను నిద్రలేపి బాత్ రూమ్ లోకి పిలుచుకుని వెళ్లింది. దేవుడు ఆదేశించాడని, తాను కచ్చితంగా ఆ పని చెయ్యాలని ఊహించుకున్న షాహీనా కొడుకు అదిల్ ను బాత్ రూమ్ లోకి పిలుచుకుని వెళ్లిన తరువాత అతని కాళ్లు చేతులు కట్టేసి పదునైన కత్తి తీసుకుని అతని గొంతు చీల్చేసి అతి దారుణంగా చంపేసింది.

కొడుకును దారుణంగా చంపేసిన షాహీనా ఆ మత్తు నుండి బయటకి రాగానే 112 ఎమర్జెన్సీ నంబర్‌కు షహీదా ఫోన్ చేసింది. తన ఆరేళ్ల కొడుకును చంపేశానని, అల్లా కోసం త్యాగం చేశానని ఆమె చెప్పడంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు. షాహిదా ఇంటికి వెళ్లగా.. బాత్రూమ్‌ లో ఆమిల్‌ రక్తపు మడుగులో కనిపించాడు. పోలీసులు తన ఇంటికి రావడంతో మేలుకున్న భర్త సులేమాన్ జరిగిన ఘోరం తెలిసి కన్నీరుమున్నీరయ్యాడు.

సులేమాన్ గతంలో గల్ఫ్‌లో పనిచేసి కొన్నేళ్ల కిందట పాలక్కడ్‌కు వచ్చి ఆటో నడుపుకుంటున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు, విచారణ చేపట్టారు. షాహిదాపై సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆమె మానసిక స్థితిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో షాహిదా చేతికి కూడా గాయమైనట్లు తెలిసింది.