Begin typing your search above and press return to search.
అమ్మ కనిపారేసిన శిశువు... శునకం ఒడిలో భద్రం..!
By: Tupaki Desk | 21 Dec 2021 12:30 AM GMTఅప్పుడే పుట్టిన శిశువుకు అందమైన ప్రపంచాన్ని పరిచయం చేసేది అమ్మ. రక్తపుముద్దగా పుట్టిన తన బిడ్డను అక్కున చేర్చుకుని... ప్రేమతో పెంచుతుంది. బిడ్డ పుట్టగానే తన పొత్తిళ్లలో అదుముకొని వెచ్చనైన ప్రేమను అందిస్తుంది. కమ్మనైన చనుబాలను పంచుతూ ఈ ప్రపంచానికి పరిచయం చేస్తుంది. అందుకే ప్రేమానురాగాలకు నిలువెత్తు నిదర్శనంగా అమ్మను కొలుస్తారు. కానీ ఓ అమ్మమాత్రం
ఇంతటి మాతృత్వానికే కళంకం తెచ్చేలా ప్రవర్తించింది. నవమోసాలు మోసిన బిడ్డను... పేగు తెంచుకుని పుట్టిన తన బిడ్డను... పురిట్లోనే వదిలేసింది. వెచ్చనైన అమ్మ పొత్తిళ్లలో ఉండాల్సిన ఆ నవజాత శిశువును పొలాలకే పరిమితం చేసింది. ఆకలి కేకలతో ఏడుస్తున్న ఆ శిశువను చూసి తల్లి మనసు కరగలేదేమో కానీ ఓ శునకం మాత్రం ఆ బిడ్డను రక్షించింది. రాత్రంతా చిన్నారిని కాపాడింది. ఈ సంఘటన చూశాకా... ఓ సినిమాలో చెప్పినట్లు... కంటేనే అమ్మ అని అంటే ఎలా... కరుణించే ప్రతి దేవత అమ్మే కదా..! అనే పాట గుర్తుకు రాక మానదు.
ఛత్తీస్ ఘడ్ లోని ముంగేలి జిల్లాలో ఈ దారుణం జరిగింది. అప్పుడే పుట్టిన బిడ్డను ఆ తల్లి స్థానికంగా ఉండే పొలాల్లో వదిలేసింది. కడుపున పుట్టిన కన్న కొడుకునే అనాథలా వదిలేసి... తమకు ఏమీ తెలియనట్లు వెళ్లిపోయింది. మాతృత్వానికి కళంకంగా మారింది. ఆ శిశువును కంటికి రెప్పలా రాత్రంతా కాపాలా కాసింది ఓ శునకం. తన పిల్లలతో పాటు ఆ శిశువును కాపాడుతూ... దగ్గరకి ఏం రాకుండా రక్షించింది. ఎటువంటి హానీ తలపెట్టకుండా రాత్రంతా పక్కనే ఉండి చూసుకుంది. ఫలితంగా ఆ నవజాత శిశువు అడవిలో రాత్రంతా కూడా క్షేమంగా ఉంది.
బిడ్డ ఆకలితో కేకలు వేయగా అక్కడ ఉన్న స్థానికులు విని చిన్నారిని వెతుక్కుంటూ వచ్చారు. కుక్క పిల్లలతో పాటు నవజాత శిశువు అక్కడ పడి ఉండడం చూసి ఒక్కసారిగా ఆశ్చర్య పోయారు. ఆ బిడ్డ తల్లి కోసం చుట్టూ పక్కల అటు ఇటూ చూశారు. కానీ ఆ దరిదాపుల్లో ఎవరూ కనిపించలేదు. ఆ పసిగుడ్డును అక్కడే వదిలివెళ్లలేక తమతోనే తీసుకెళ్లారు. చత్తీస్ ఘడ్ లోని లోర్మీ సరిస్టాల్ గ్రామం ఈ ఘటనకు వేదిక అయ్యింది.
అన్నీ తానై చూసుకోవాల్సిన అమ్మ వదిలేసి వెళ్తే... ఆ శునకం మాత్రం అమ్మ స్థానం తీసుకుని కాపాడింది. ఈ సంఘటన చూసిన స్థానికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆకలితో చిన్నారి ఏడవడం అక్కడి వారిని కలచివేసింది. అప్పుడే పుట్టిన బిడ్డ ఇలా పొలాల గట్లమీద పడి ఉండడం చూసి... కంటతడి పెట్టుకున్నారు. ఆ బాబును అక్కున చేర్చుకుని అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న అధికార యంత్రాంగం పసికందుని వదిలేసిన వారి జాడ కోసం ఆరా తీస్తున్నారు. శిశువును ఆ రాష్ట్ర చైల్డ్ వెల్ ఫేర్ అధికారులకు అప్పగించారు. ఈ విషయాన్ని ఓ ఐపీఎస్ అధికారి ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.