Begin typing your search above and press return to search.
అనాథ శవాల్లో అమ్మ.. కడచూపు కోసం కొడుకు ఆరాటం!
By: Tupaki Desk | 1 Jun 2021 12:30 AM GMTకరోనా మహమ్మారి కుటుంబాలను కుటుంబాలనే కబళిస్తోంది. వైరస్ బారిన పడిన వారికి ఇంట్లో వారు ఎలా ఉన్నారో తెలుసుకోలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కనిపెంచిన వారి కడచూపునకు నోచుకోలేకపోతున్నారు. అందరూ ఉన్నా అనాథ శవాల్లో అంత్యక్రియలు నిర్వహించాల్సి వస్తోంది. అమ్మ చివరి చూపు కోసం ఓ కొడుకు పడిన ఆరాటం చూస్తే కన్నీళ్లు ఆగవు.
తిరుపతిలోని కొర్లగుంటలో నివసించే 62 ఏళ్ల లక్ష్మీదేవి, ఆమె కుమారుడు, కోడలు కరోనా బారిన పడ్డారు. ముగ్గురికి వైరస్ సోకగా తొలుత ఇంట్లోనే ఉండి చికిత్స పొందారు. కానీ పరిస్థితి కాస్త విషమించడం వల్ల ఈనెల 14న రుయా ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ లక్ష్మీదేవికి మాత్రమే బెడ్ దొరికింది. ఆమె కొడుకు, కోడలు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అలా ముగ్గురు వేరయ్యారు. లక్ష్మీదేవి దగ్గర ఫోన్ లేదు. అమ్మ ఆరోగ్య సమాచారంపై ఆరా తీసే అవకాశం లేకుండా పోయింది. ఆ తర్వాత ప్రైవేటు ఆస్పత్రిలో లక్షల ఫీజు అవుతోందని కరోనా నుంచి కోలుకోకముందే కొడుకు, కోడలు ఇంటికి వెళ్లారు.
ఇంటికి వచ్చినా ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల అమ్మ కోసం ఆరా తీసే పరిస్థితి లేదు. పరిస్థితి కాస్త మెరుగయ్యాక ఆస్పత్రికి వెళ్లారు. కానీ అక్కడ ఆమె లేదని తెలిసింది. ఆస్పత్రి నుంచి సరైన సమాధానం లేదు. అక్కడ ఉండే వాలంటీర్, సెక్టోరల్ అధికారి లక్ష్మీదేవి సాయంతో అమ్మ మృతి చెందిందని తెలుసుకున్నారు. అనాథ శవాలతో పాటు అంత్యక్రియలు జరిపామని వారు చెబితే ఏం చేయాలో తెలియక కుప్పకూలిపోయారు. అమ్మా... నీ కడచూపు దక్కలేదు అంటూ బోరున విలపించారు.
భార్యను తీసుకొని అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించే ప్రదేశానికి వెళ్లారు. అంత్యక్రియలు నిర్వహించడానికి ముస్లిం సభ్యులు అక్కడికి వచ్చారు. ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి చొరవతో మృతదేహాల్లో గాలించే అవకాశం లభించింది. కాగా అక్కడ ఆమె మృతదేహాన్ని గుర్తించారు. అమ్మా... నీ కడచూపు దక్కింది అంటూ కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆ కొడుకు రోదనను చూసి అక్కడి వాళ్లు కంటతడి పెట్టుకున్నారు. కొడుకు సమక్షంలో ఆ మాతృమూర్తికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అమ్మ చివరి చూపు కోసం ఓ కొడుకు పడిన ఆరాటం ఇప్పడు అందరినీ కన్నీరు పెట్టిస్తోంది.