Begin typing your search above and press return to search.

తల్లి ఎఫైర్ తో కొడుకు జీవితం నాశనం

By:  Tupaki Desk   |   14 Aug 2021 8:57 AM GMT
తల్లి ఎఫైర్ తో కొడుకు జీవితం నాశనం
X
తల్లి చేసిన తప్పు బిడ్డకు శాపమైంది. ఆమె అక్రమ సంబంధం విషయం 20 ఏళ్ల తర్వాత కొడుకుకు వింత వ్యాధికికారణమైంది. 20 ఏళ్ల క్రితం తనకు పెళ్లికాక ముందు చేసిన తప్పు ఓ మహిళకు ఇప్పుడు షాకిచ్చింది. అతి తనవల్లే జరిగిందని ఒప్పుకుంది.

ఒడిషాకు చెందిన దంపతులకు 20 ఏళ్ల క్రితం పెళ్లయ్యింది. వారికి ఓ కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడికి వంశపారంపర్యంగా వచ్చే ‘కీళ్ల నొప్పులతో’ అతడు బాధపడుతున్నాడు. చాలా రోజులు అవస్థలు పడుతున్నాడు. కొడుకు బాధ చూడలేని తండ్రి ఎలాగైనా మెరుగైన వైద్యం అందించాలని గురుగ్రామ్ లోని ఓ పేద్ద ఆస్పత్రికి తీసుకెళ్లాడు. దీంతో యువకుడిని పరిశీలించిన వైద్యులు అతడికి ‘సికిల్ సెల్ అనిమియా’ అనే కీళ్ల వ్యాధి ఉన్నట్టు తేల్చారు.

ఈ వ్యాధి వంశపారంపర్యంగా వస్తుందని వైద్యులు తెలిపారు. తల్లిదండ్రులు ఇద్దరిలో ఒకరికి ఉండడం వల్లే వస్తుందన్నారు.తల్లిదండ్రులకు టెస్టు చేయగా.. ఆ లక్షణాలు తల్లిలో బయటపడ్డాయి. కానీ తండ్రిలో ఆ లక్షణాలు లేవు. దీంతో వైద్యులు అనుమానం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే ఇంటికెళ్లిన అనంతరం భార్యను నిలదీశాడు. ఇంకేముంది అసలు విషయాన్ని భార్య చెప్పుకొచ్చింది. తాను పెళ్లి తర్వాత ఒకరితో అక్రమ సంబంధం పెట్టుకున్నానని.. తరచూ కలిసేవాళ్లమని ఒప్పుకుంది. ప్రస్తుతం ఉన్న కొడుకు అతడి ద్వారానే పుట్టాడని తేల్చిచెప్పింది. ఆమె ప్రియుడికి కూడా సికిల్ సెల్ వ్యాధి ఉండొచ్చని వైద్యులు తెలుపడంతో భర్త షాక్ అయ్యాడు.

తల్లి చేసిన తప్పుకు ఇప్పుడు పిల్లలు బలై అయ్యేలా చేసింది. అక్రమ సంబంధాల వల్ల ఆ కుటుంబం ఇప్పుడు చిన్నాభిన్నమైన పరిస్థితి నెలకొంది.