Begin typing your search above and press return to search.
కరోనా కన్నీటి గాధ : రెండు రోజుల్లో ఇంటికి , ఫైర్ యాక్సిడెంట్ లో తల్లీ కొడుకులు మృతి !
By: Tupaki Desk | 10 Aug 2020 8:30 AM GMTకరోనా వైరస్ కారణంగా ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. అప్పటివరకు ఎంతో ఆనందంగా గడిపిన ఎన్నో కుటుంబాల్లో కరోనా మహమ్మారి ప్రవేశించి, వారి ఆనందాన్ని కబళిస్తుంది. తాజాగా ప్రకాశం జిల్లాలోని ఓ కుటుంబంలో కరోనా తీరని శోకాన్ని మిగిల్చింది. కరోనా కాటు నుంచి తప్పించుకునేందుకు మెరుగైన చికిత్స తీసుకునేందుకు చేసిన ప్రయత్నంలో అనుకోని విదంగా మృత్యువు అగ్ని రూపంలో వచ్చి వారిని తీసుకుపోయింది. విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్‌లో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన జయలక్ష్మి, పవన్ కుమార్ కుటుంబంలోని కన్నీటిగాధ ఇదే.
పూర్తి వివరాలు చూస్తే .. కందుకూరు పట్టణంలోని గణేష్ నగర్ లో నివాసం ఉండే దుడ్డు ప్రసాద్ ఎన్ టీఆర్ బొమ్మ సెంటర్ లో కిరాణా షాపు నిర్వహిస్తుంటాడు. అలాగే ఆంజనేయ స్వామి మాల ధరించే భక్తులకు గురుస్వామిగా ప్రసిద్ధి. స్థానికంగా అయన బాగా సుపరిచితుడు. ఈ క్రమంలో గత నెల 30వ తేదీన కరోనా బారిన పడ్డాడు. మెరుగైన వైద్యం తీసుకోవాలని విజయవాడ రమేష్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు. చికిత్స అనంతరం ఆయన కోలుకుని రెండు రోజుల క్రితమే ఇంటికి చేరాడు. అయితే ప్రసాద్ నుంచి వైరస్ ఆయన భార్య వెంకట జయలక్ష్మి , ఆయన పెద్దకుమారుడు పవన్ కుమార్, రెండో కుమారుడు మనోజ్ కు సోకింది. కరోనా లక్షణాలు ఉండడంతో పరీక్ష చేయించుకోవడంతో పాజిటివ్ గా తేలింది.
ఎక్కువ కరోనా లక్షణాలు ఉన్న కారణంగా వెంకట జయలక్ష్మి, పవన్ కుమార్ లు కూడా రమేష్ హాస్పిటల్ లోనే జాయిన్ అయ్యారు. ఐదు రోజులుగా వారిని స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఎంబీబీఎస్ చదువుతున్న రెండో కుమారుడు మనోజ్ కి తక్కువ కరోనా లక్షణాలు ఉండటంతో అయన హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్నాడు. రమేష్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న జయలక్ష్మి, పవన్ కుమార్ లు కూడా ప్రస్తుతం కోలుకుని ఆరోగ్యంగా ఉన్నట్లు సమాచారం. మరో రెండు రోజుల్లో ఇంటికి పంపిస్తామని అక్కడి వైద్యులు చెప్పారు. ఇంతలోనే ఊహించని విధంగా జరిగిన అగ్ని ప్రమాదంలో వారు ఇరువురూ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్‌లో ఆదివారం తెల్లవారు జామున జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న తల్లి, కుమారుడు ఇద్దరూ మృతిచెందారు. కరోనా నుండి కోలుకున్నా కూడా మృత్యువు నుండి మాత్రం కోలుకోలేకపోయారు.
ఇకపోతే, ఈ ప్రమాదంలో చనిపోయిన పవన్ కుమార్ ప్రస్తుతం బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్ వల్ల ఇంటికి వచ్చి వర్క్ ఫ్రం హోం విధానంలో ఇక్కడి నుంచే విధులు నిర్వర్తిస్తున్నాడు. పవన్ కుమార్ కు ఏడాదిన్నర క్రితం గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన మౌనికతో వివాహమైంది. మౌనిక 7వ నెల గర్భిణి. ప్రస్తుతం ఆమె తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. పవన్ కుమార్ మృతితో ఆమె పరిస్థితి ఇప్పుడు ఎటూ కాకుండా పోయింది. ఇలా కరోనా ఈ కుటుంబంలో కన్నీటిని మిగిల్చింది.