Begin typing your search above and press return to search.

ఏడాదిలో 16.5కోట్ల సార్లు వెతికిన ప్రశ్న.. తెలిస్తే షాకే

By:  Tupaki Desk   |   30 April 2021 5:30 PM GMT
ఏడాదిలో 16.5కోట్ల సార్లు వెతికిన ప్రశ్న.. తెలిస్తే షాకే
X
గతంలో ఎప్పుడూ లేని అనుభవాల్ని సుదీర్ఘ లాక్ డౌన్ ఇచ్చింది. మహమ్మారి దెబ్బకు జడిసిన దేశాలు.. దారి బారి నుంచి తప్పించుకోవటానికి వీలుగా లాక్ డౌన్ విధించటం.. అనంతరం దాన్ని ఎప్పటికప్పుడు పొడిగించుకుంటూ వెళ్లిన వైనం తెలిసిందే. ఇలాంటివేళ.. ఇంట్లోనే ఉండిపోయిన పలువురికి పలు సమస్యలు వెంటాడాయి. ఇంటికే పరిమితమైన నేపథ్యంలో పలు మానసిక సమస్యల్ని వారు ఎదుర్కొంటున్నారు.

ఇలాంటివేళ.. భర్తలు పలువురు కొన్ని విచిత్రమైన అంశాల గురించి వెతికిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది. లాక్ డౌన్ కారణంగా.. ఇండ్లలో గృహహింస పెరిగిన వైనం తెలిసిందే. రోజువారీ జీవితంలో ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండటంతో చాలా సందర్భాలు గొడవలకు దూరంగా ఉండే పరిస్థితి. అందుకు భిన్నమైన పరిస్థితుల్ని లాక్ డౌన్ తీసుకొచ్చింది. ఇళ్లు కదిలి బయటకు వెళ్లాల్సిన అవసరం రాకపోవటం.. ఇంటికే పరిమితం కావటం.. ఇల్లే ప్రపంచంగా మారిన నేపథ్యంలో చిన్న విషయాలకే ఎక్కువగా స్పందించే గుణం.. భార్యభర్తల మధ్య చోటు చేసుకుంటోంది.

మరికొన్ని ఉదంతాల్లో ఇంట్లోని కుటుంబ సభ్యుల మధ్య కూడా అనవసరమైన గొడవలకు.. ఘర్షణలకు కారణమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. లాక్ డౌన్ కారణంగా మానసిక సమస్యలు ఎక్కువైన విషయాన్ని నిరూపించేందుకు ఒక సంస్థ ఒక అధ్యయనాన్ని చేసింది. ఇందులో భాగంగా గూగులమ్మను ఎక్కువ మంది అడిగిన ప్రశ్నలు.. వెతికిన అంశాల మీద ఒక సర్వే నిర్వహించారు. ఇందులో ఒక కొత్త విషయం బయటకు వచ్చింది. దాని ప్రకారం.. గత ఏడాది చాలామంది భర్తలు.. ‘భార్యను అదుపులో పెట్టటం ఎలా? ఎవరికి తెలీకుండా భార్యనుకొట్టటం ఎలా?’’ లాంటి ప్రశ్నలకు సమాధానాల కోసం గూగులమ్మను వెతికారట. అది కూడా 16.5 కోట్లసార్లు సెర్చ్ చేయటం చూస్తే.. ప్రపంచ భర్తలందరికి కొత్త సమస్యను లాక్ డౌన్ తెచ్చి పెట్టినట్లుగా అర్థం కాక మానదు. గూగులమ్మను అడిగిన ఈ ప్రశ్న ఇప్పుడు వైరల్ గా మారటమే కాదు.. ఇళ్లల్లోని మగాళ్ల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.