Begin typing your search above and press return to search.

పాక్ లో ఇండియాపై సర్వే.. షాకింగ్ రిజల్ట్స్

By:  Tupaki Desk   |   7 Jan 2017 7:11 AM GMT
పాక్ లో ఇండియాపై సర్వే.. షాకింగ్ రిజల్ట్స్
X
భారత్ - పాక్ ల మధ్య సంబంధాలు అంతంతమాత్రం అయిన నేపథ్యంలో అక్కడి ప్రజలు కూడా మనమంటే పీకల్దాకా కోపంతో ఉన్నారనుకుంటాం. కానీ... వారిలో అలాంటిదేమీ లేదని సర్వేలు చెబుతున్నాయి. వారు ఇండియాతో మైత్రిని కోరుకుంటున్నారు. భారత్ తో సంబంధాల విషయంలో పాక్ ప్రజలు ఏమనుకుంటున్నారు? అనే విషయం ఓ సర్వేలో తేటతెల్లమైంది.

భారత్ లో ఉరీ ఉగ్రదాడి - పీఓకేలో భారత బలగాల సర్జికల్ స్ట్రయిక్స్ ఘటనలు జరిగిన తర్వాత ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడిన విషయం తెలిసిందే. సరిగ్గా అదే సమయంలో భారత్ పాక్ సంబంధాలపై ప్రఖ్యాత ‘గాలప్’ సర్వే సంస్థ పాకిస్థాన్ లో ఉన్న తన శాఖ ద్వారా సర్వే నిర్వహించింది. పాకిస్థాన్ లోని సింధ్ - పంజాబ్ - బలూచ్ - ఖైబర్ ఫక్తూన్ క్వా రాష్ట్రాల్లోని పలు గ్రామాలు - పట్టణాల్లో సర్వే చేసి... 'భారత్ తో చర్చలకు మీరు అనుకూలమేనా?' అనే ప్రశ్న అడిగారు.. దానికి 68 శాతం మంది 'చర్చలు జరగాలి' అంటూ సమాధానమిచ్చారు. 31 శాతం మంది 'వద్దు' అని చెప్పారు. కేవలం ఒక్క శాతం మాత్రం 'తెలియదు' అని సమాధానమిచ్చారు.

చర్చల ద్వారా ఇరు దేశాల్లో శాంతి నెలకొంటుందని... ఇరు దేశాలు స్నేహపూర్వకంగా ఉంటే, దక్షిణాసియాలో తిరుగే ఉండదని మెజారిటీ పాకిస్థానీలు అభిప్రాయపడ్డారు. సర్వే ఫలితాలతో పాక్ లోని పలువురు షాక్ కు గురయ్యారు. ముఖ్యంగా పాక్ ఆర్మీ - ఐఎస్ ఐ - అక్కడి ఉగ్రవాద సంస్థలకు ఈ ఫలితాలు మింగుడుపడటం లేదు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/