Begin typing your search above and press return to search.

పల్లె పడుచులే స్ట్రాంగ్​..వారికే అధికంగా రొమ్ము క్యాన్సర్

By:  Tupaki Desk   |   4 Oct 2020 10:10 AM GMT
పల్లె పడుచులే స్ట్రాంగ్​..వారికే అధికంగా రొమ్ము క్యాన్సర్
X
పట్టణాల్లో నివసించే మహిళలతో పోల్చుకుంటే పల్లెల్లో ఉండే మహిళలకు రొమ్ము క్యాన్సర్​ వచ్చే అవకాశం చాలా తక్కువని వైద్యులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో మహిళల్లో రొమ్ము క్యాన్సర్​ బాధితులు చాలా ఎక్కువగా కనిపిస్తున్నారు. బాధితుల్లో కేవలం 10 మంది మాత్రమే తొలిదశలో ఉన్నప్పుడు ఆస్పత్రులకు వస్తున్నారు. మిగతా 70 శాతం మంది రెండు మూడు దశల్లో ఆస్పత్రికి వస్తున్నారు. దీంతో వైద్యులకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరో 20 శాతం మంది నాలుగో దశలో చికిత్సకోసం వస్తున్నారు.

రొమ్ము క్యాన్సర్​ విషయంలో చాలా మంది మహిళలకు అవగాహన ఉండటం లేదని.. రొమ్ము క్యాన్సర్​ గురించి ప్రతి స్త్రీ తప్పక తెలుసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. అక్టోబర్​ మాసం మొత్తం రొమ్ము క్యాన్సర్​పై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.

రొమ్ము క్యాన్సర్​ లక్షణాలు

ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన మహిళలకే రొమ్ము క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉంది. ఆలస్యంగా బిడ్డలు కన్న వారికి.. పిల్లలకు పాలు ఇవ్వని వారికి ఈ క్యాన్సర్​ ఎక్కువగా వస్తుంది. వారసత్వంగా కూడా రావొచ్చు. చిన్న వయసుల రజస్వల అయినవారికి వచ్చే అవకాశం ఉంది. ధూమపానం, ఆల్కాహాల్‌ సేవించే మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ ప్రభావంతో కూడా ఇది వచ్చే అవకాశం ఉంది.

రొమ్ము క్యాన్సర్‌ ఎవరికి వారే గుర్తించవచ్చు. పీరియడ్‌ వచ్చిన వారం రోజుల తర్వాత స్నానం చేస్తున్న సమయంలో రొమ్ములో గింజంత సైజులో కణుతులు వచ్చినా, రొమ్ముపై చర్మం రంగు మారిందా, చంకల్లో గడ్డలు వస్తే వెంటనే డాక్టర్​ను సంప్రదించాలి.


మమ్మోగ్రామ్‌తో నిర్ధారణ

క్యాన్సర్‌ను మమోగ్రామ్‌ అనే స్కానింగ్‌ ద్వారా నిర్ధారిస్తారు. ఇప్పుడు 3డీ మమ్మోగ్రామ్‌ కూడా అందుబాటులో ఉంది. ప్రతి మహిళ ఏడాదికోసారి మమ్మోగ్రామ్​ చేయించుకోవడం ఉత్తమం.