Begin typing your search above and press return to search.

హైదరాబాద్ రోడ్డు ప్రమాదాల్లో చనిపోయేవారిలో పాదచారులే ఎక్కువ

By:  Tupaki Desk   |   24 Sep 2020 12:30 AM GMT
హైదరాబాద్ రోడ్డు ప్రమాదాల్లో చనిపోయేవారిలో పాదచారులే ఎక్కువ
X
చిన్నది కానీ పెద్దది కానీ నిత్యం అనుక్షణం ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదం జరగటం చూస్తున్నదే. ఏటా కొన్ని వేల మంది ఉసురు తీసే ఈ ప్రమాదాల కారణంగా వేలాది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో గాయపడే వారికారణంగా ఎదురయ్యే కష్టాలు అన్ని ఇన్ని కావు. ఇదిలా ఉంటే.. తాజాగా సైబరాబాద్ పోలీసులు జరిపిన అధ్యయనంలో ఆసక్తికర అంశం ఒకటి వెలుగు చూసింది.

రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా చనిపోతున్నది పాదచారులే అన్న విషయాన్ని గుర్తించారు. స్థానికంగా జరిగే ప్రమాదాల్లో అధిక శాతం టూ వీలర్లు.. కార్లు.. ఆటోలతోనే చోటు చేసుకోవటం మరో ఆసక్తికర అంశంగా చెప్పాలి. ప్రతి ఏటా రోడ్డు ప్రమాదాల కారణంగా మరణిస్తున్న వారిలో మూడో వంతు మంది పాదచారులే ఉన్నట్లుగా పోలీసుల అధ్యయనంలో తేలింది. ప్రమాదాలకు కారణాల్ని విశ్లేషిస్తే.. రాష్ డ్రైవింగ్ కారణంగా ప్రమాదాలు అత్యధికం జరిగితే.. అతి వేగం.. మద్యం మత్తులో డ్రైవింగ్ కారణంగా.. నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా ప్రమాదాలు పెద్ద ఎత్తున చోటు చేసుకుంటున్నట్లుగా సైబరాబాద్ పోలీసుల అధ్యయనం వెల్లడించింది.

మొత్తం రోడ్డు ప్రమాదాల్లో పదిహేను శాతం ప్రమాదాలు ప్రాణాలు తీస్తున్న విషయాన్ని గుర్తించారు. 85 శాతం మంది గాయపడితే.. తీవ్రమైన గాయాల వారి సంఖ్య ఎక్కువేనని తేల్చారు. ప్రమాదాలకు కారణమవుతున్న వాహనాల్ని చూస్తే.. టూ వీలర్ టూ వీలర్ ఢీ కొట్టటం.. బైకు- కారు ఢీ కొట్టటం.. బైకు - పాదచారుల్ని ఢీ కొట్టటం.. లాంటివి ఎక్కువగా ఉంటున్నాయి. ఇక.. ఆటో - బైకు.. లారీ - బైకుల కారణంగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మొత్తంగా ప్రమాదాల్ని చూస్తే.. బైకులు.. పాదచారులే ప్రమాదాల బారిన పడుతున్నట్లుగా స్పష్టమవుతుంది.