Begin typing your search above and press return to search.
కిడ్నాప్ కేసులన్నీ ప్రేమికులవేనంటున్నారు
By: Tupaki Desk | 19 Aug 2015 9:24 AM GMTతరచూ కిడ్నాప్ కేసుల్ని పోలీసులు నమోదు చేయటం.. వాటికి సంబంధించిన వార్తలు పత్రికల్లో రావటం తెలిసిందే. అయితే.. కిడ్నాప్ వ్యవహారంపై నేషనల్ క్రైమ్ రికార్డు సరికొత్త విషయాల్ని వెల్లడించింది. కిడ్నాప్ కేసులుగా నమోదైన వాటికి సంబంధించి అసలు కథ వేరే ఉంటుందని తన నివేదికలో వెల్లడించింది.
గత ఏడాది దేశవ్యాప్తంగా మొత్తం 77వేల కిడ్నాప్ లు చోటు చేసుకున్నాయని.. వీటిల్లో 40 శాతానికి పైనే ప్రేమ వ్యవహారాలే అని పేర్కొనటం గమనార్హం. అమ్మాయి.. అబ్బాయి ప్రేమించుకొని పెళ్లి చేసుకునేందుకు పెద్దలకు చెప్పకుండా పారిపోవటం.. దీన్ని పిల్ల తల్లిదండ్రులు.. బంధువులు కిడ్నాప్ కేసులుగా నమోదు చేసుకోవటం జరుగుతుందని తేల్చింది.
దేశ వ్యాప్తంగా నమోదైన 77వేల కేసుల్లో దాదాపు 31వేల కేసుల వరకూ ప్రేమ పెళ్లిళ్ల కోసం పారిపోయిన ఉదంతాల్నే కిడ్నాప్ లుగా పేర్కొంటూ కేసులు నమోదు చేయిస్తున్నారని పేర్కొంది. అదే సమయంలో 1500 కిడ్నాప్ లు చంపేందుకు.. 676 కిడ్నాప్ లు డబ్బు వసూలు చేసేందుకు కిడ్నాప్ చేశారని తెలిపింది.
ఇక.. ప్రేమను పెళ్లిళ్లుగా మార్చుకునే పనిలో భాగంగా కిడ్నాప్ అయ్యారంటూ పెట్టే కేసులు ఎక్కువగా అసోం.. యూపీ.. బీహార్ లో ఉంటున్నాయని తేల్చారు. బీహార్.. అసోం రాష్ట్రాల్లో నమోదైన కిడ్నాప్ కేసుల్లో 50 శాతానికి పైగా పెళ్లి చేసుకోవటానికే జరిగాయని.. ఉత్తరప్రదేశ్ లో మాత్రం కిడ్నాప్ కేసులుగా నమోదైన వాటిల్లో 70 శాతం ప్రేమ వ్యవహారాలేనని తేల్చింది. సో.. దేశంలో జరిగే కిడ్నాప్ లలో ఎక్కువ భాగంగా ప్రేమ.. పెళ్లి వ్యవహారంతో ముడిపడినవేనన్న మాట.