Begin typing your search above and press return to search.

అంతా డేటింగ్ మయం ఇండియా అంతా డేటింగ్ మయం!

By:  Tupaki Desk   |   11 July 2019 4:54 AM GMT
అంతా డేటింగ్ మయం ఇండియా అంతా డేటింగ్ మయం!
X
ప్రేమ అనేది యూనివర్సల్ కాన్సెప్ట్ అయినా డేటింగ్ మాత్రం యూనివర్సల్ కాన్సెప్ట్ కాదు. ఇండియా లాంటి స్ట్రాంగ్ కల్చర్.. ట్రెడిషనల్ థింకింగ్ ఉన్న దేశాలలలో ఇది మొదటి నుంచి పెద్దగా లేదు. కానీ గ్లోబలైజేషన్.. టెక్నాలజీ పుణ్యామా అని డేటింగ్ అనేది మన జీవితాల్లో భాగం అయిపోయింది. అయితే ఈ జెనరేషన్ యూత్ కు.. మిడిల్ ఏజ్ వారికి ఇండియా లో డేటింగ్ సర్వసాధారణం అయిందని తెలుసు కానీ పెద్దవాళ్లకు తెలియదు.

ఒకరినొకరు చూసుకోవడం.. సైగలు చేసుకోవడం.. కిలికి భాషలో ఫ్రీక్వెన్సీ సెట్ చేసుకోవడం అంతా పాత కాలం రోత. ఇప్పుడు ట్రెండ్ అంతా ఫోన్ లో డేటింగ్ యాప్ డౌన్ లోడ్ చేసుకోండి.. నచ్చినవారికి లైకులు కొట్టుకోండి.. వారి చేత లైకులు కొట్టించుకోండి. మాటా మాటా కలపండి. తర్వాత జింతాత జిత జిత.

ఇండియాలో ఇదంతా లేదు.. ఎవరో నూటికి కోటికి ఒకరు చేస్తుండవచ్చుగాక.. మా ఇంట్లో ఇలా డేటింగ్ చేసేవారు లేరు అని ఎవరికి వారు సర్దిచెప్పుకోవచ్చు. కానీ డేటింగ్ యాప్స్ డౌన్లోడ్స్ వాటి యూజర్ల సంఖ్య అబద్ధాలు చెప్పవు కదా?

టెక్ లో మీడియా అనే సంస్థ ప్రచురించిన కథనం ప్రకారం ఈ ఏడాది ఇండియాలో 9 బెస్ట్ డేటింగ్ యాప్స్ ఇవి.

1 . టిండర్ (Tinder)

2. ట్రూలీ మ్యాడ్లీ (TrulyMadly)

3. హ్యాపెన్(Happn)

4. వూ(Woo)

5. ఓకె క్యుపిడ్(OkCupid)

6. హింజ్(Hinge)

7. కాఫీ మీట్స్ బేగెల్ (Coffee Meets Bagel)

8. ఐల్(Aisle) *నోట్: s అక్షరం సైలెంట్ బాబులు.. దయచేసి మన తెలుగు నాటు స్టైల్ లో 'ఐజిల్' అని ఖూని చెయ్యకండి!

9. బడూ(Badoo)

ఇవే కాకుండా ట్రై డేట్(TryDate).. గ్రైండర్(Grindr).. మొకో (Moco) క్వాక్ క్వాక్ (QuackQuack) అనేవి కూడా మంచి డేటింగ్ యాప్స్ అంట. ఈ లిస్టుతో డేటింగ్ యాప్స్ అయిపోలేదు. బంబుల్(Bumble).. వాప్లాగ్ (Waplog).. లవ్లీ(Lovely).. జౌమో(Jaumo).. స్కౌట్(Skout).. హై ఫైవ్(Hi5).. టాగ్డ్(Tagged).. పీఓఎఫ్(POF).. కీప్(Qeep).. లవూ (Lovoo).. మింగిల్ 2(Mingle2).. బ్లెండర్ (Blendr).. నీన్బో(Neenbo).. ఈ లిస్టు రాసుకుంటూ పోతే టెలిఫోన్ డైరెక్టరీ అంత పెద్దది అవుతుంది కాబట్టి ఇంతటి ఆపేస్తున్నాం.

ఇవి కాకుండా లెస్బియన్స్ కోసం స్పెషల్ డేటింగ్ యాప్స్ ఉన్నాయి. హర్(Her).. జో(Zoe).. ఫెమ్(Fem).. ఓన్లీ వుమెన్(Only Women).. జస్ట్ షీ(Just She).. వాపా(Wapa).

గే ల కోసం కూడా కుప్పలుతెప్పలుగా యాప్స్ ఉన్నాయి. బ్లూడ్(Blued).. సర్జ్ (Surge)..ఓన్లీ ల్యాడ్స్ (Only Lads).. డాడీ హంట్(Daddyhunt).

ఇవి కాకుండా పెద్దవాళ్ళ కోసం (50+)డేటింగ్ యాప్స్ ఉన్నాయి. లుమెన్(Lumen).. సీనియర్ డేటింగ్ (Senior Dating) సీనియర్ పీపుల్ మింగిల్(Senior People Mingle).

ఇంత పెద్ద లిస్టు ఎందుకు రాయాల్సి వచ్చిందంటే మన చుట్టూ ఇంత జరుగుతుందని చాలామందికి తెలియదు. ఎవరికైనా అనుమానాలు ఉంటే గూగుల్ ప్లే స్టోర్ కు వెళ్లి ఈ యాపుల యవ్వారాన్ని చెక్ చేసుకోవచ్చు! ఈ డేటింగ్ యాప్స్ లో దాదాపు అన్నీ ఫ్రీనే. అయితే వాటిలో ప్రీమియం మెంబర్ షిప్ కూడా ఉంటుంది. ఆ ఫీజు పే చేసిన వారు ప్రీమియం మెంబర్స్. ఒక్కో యాప్ కు మిలియన్ల కొద్ది డౌన్లోడ్స్ ఉన్నాయి. ఆ డౌన్లోడ్స్ అన్నీ ఇండియా నుంచి కాకపోయినా ఇండియాలో మాత్రం వాటి ప్రెజెన్స్ ఫుల్లుగా ఉంది. వాడుకోవడానికి ఎటువంటి అడ్డంకులు లేవు.

ఇండియాలో ఉన్న డేటింగ్ సైట్స్ లో టాప్ ప్లేస్ లో ఉన్నది మాత్రం 'టిండర్'. టిండర్ ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో మన ప్రిఫరెన్సును బట్టి ఫోటోలు కనిపిస్తాయి. ఆ ఫోటో నచ్చకపోతే ఎడమ వైపుకు స్వైప్ చేస్తాం. ఒకవేళ నచ్చితే కుడివైపుకు స్వైప్ చేస్తాం. అవతల వాళ్లకు కూడా మనం నచ్చితే చాటింగ్ స్టార్ట్. ఇది స్టొరీ. టిండర్ లో ప్రపంచవ్యాప్తంగా రోజుకు వన్ బిలియన్ కు పైగా స్వైప్స్ రికార్డ్ అవుతుంటే అందులో రోజుకు 7.5 మిలియన్ స్వైప్స్ ఇండియాలో రికార్డ్ అవుతున్నాయట. ఈ స్వైప్స్ సంఖ్య ఇండియా లోనే ఎక్కువట. అయినా ఇవన్నీ పాత లెక్కలు. కొత్త లెక్కలు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీన్ని బట్టి మన జనాలు డేటింగ్ లో ఎంత ఊపులో ఉన్నారో అర్థం అవుతుంది.

ప్రస్తుతం ఇండియాలో ఆన్లైన్ డేటింగ్ మార్కెట్ ప్రపంచంలో 2.7% ఉందట. కానీ వేగంగా మారుతున్న కల్చరల్ ట్రెండ్స్.. స్మార్ట్ ఫోన్.. స్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులో ఉండడం మన డేటింగ్ అలవాట్లను పూర్తిగా మారుస్తున్నాయట. అంతే కాకుండా ఇండియన్స్ సెక్సువల్ బిహేవియర్ కూడా గతంలో కంటే పూర్తిగా మారుతోందట. అది సంగతి!