Begin typing your search above and press return to search.

నమ్మరు కానీ.. ఆ చేప ఖరీదు రూ.4.48లక్షలు.. ప్రత్యేకత ఏమంటే?

By:  Tupaki Desk   |   14 Nov 2020 6:45 AM GMT
నమ్మరు కానీ.. ఆ చేప ఖరీదు రూ.4.48లక్షలు.. ప్రత్యేకత ఏమంటే?
X
అప్పుడప్పుడు చోటు చేసుకునే కొన్ని పరిణామాలు ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఖరీదైన చేపల గురించి విని ఉంటాం. కానీ.. మరీ ఇంత ఖరీదైన చేపా? అని ముక్కున వేలేసుకోవాల్సిన పరిస్థితి. ఒడిశాలో తాజాగా దొరికిన ఒక భారీ చేప ఇప్పుడు వార్తాంశంగా మారింది. ఎందుకంటే.. ఈ అరుదైన చేప పలికిన ధర ఎంతో తెలుసా? అక్షరాల రూ.4.48లక్షలు. ఎందుకింత ధర పలికింది? దాని ప్రత్యేకత ఏమిటన్న విషయాల్లోకి వెళితే..

ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లా జలేస్వర్ కు చెందిన మత్స్యకారుని వలకు అరుదైన చేప ఒకటి లభించింది. 28 కేజీల బరువు ఉన్న ఈ చేప..వేలంలో భారీ ధర పలికింది. బయట మార్కెట్లో దీన్ని ఏ పేరుతో పిలుస్తారో తెలీని ఈ మత్స్యకారుడు.. స్థానికంగా మాత్రం తెలియబెక్టి అని పిలుస్తారని చెబుతున్నారు.

ఈ చేప పొట్టు ఔషధాల తయారీకి వాడతారని చెబుతున్నారు. కిలో రూ.16వేలు చొప్పున చెల్లించి కొనుగోలు చేసిన ఈ చేప ఇప్పడు అందరిని ఆకర్షిస్తోంది. ఈ అరుదైన చేపను వేలం వేయగా..దీని గురించి తెలుసుకున్న ఏఆర్ఎం సంస్థ ప్రతినిధులు భారీ ధరను చెల్లించి తమ సొంతం చేసుకున్నారు. ఒక చేపకు రూ.4.48లక్షలు పలకటం ఇప్పుడు ఈ చేప వ్యవహారం అందరి నోళ్లల్లో నానుతోంది.