Begin typing your search above and press return to search.
రాకాసి దోమలు.. రక్తం తాగుతున్నాయి
By: Tupaki Desk | 15 Sep 2020 12:30 AM GMTఇప్పటికే కరోనాతో ఉక్కిరిబిక్కిరవుతున్న అమెరికాకు మరో కొత్త చికాకు వచ్చి పడింది. ఓ దేశంలో ఓ ప్రాంతాంలో రాకాసి దోమలు పుట్టుకొచ్చాయి. ఈ దోమలు ఇప్పటికే వందలాది జంతువుల రక్తాన్ని పీల్చి.. వాటి ప్రాణాలు తీశాయి. దీంతో ఆ దేశ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ రాకాసి దోమలు మూకుమ్మడిగా వేలసంఖ్యలో వచ్చి పాడి జంతువుల్ని, వన్యప్రాణాలను చంపేస్తున్నాయి. ప్రస్తుతం ఈ రాకాసి దోమలమూక అమెరికా రాష్ట్రంలోని లూసియానాలో ఉంది.
గత ఆగస్టు 27న వచ్చిన హరికేన్ తుఫాన్ కారణంగా ఒక్కసారిగా ఈ రాకాసి దోమలు లూసియానా ప్రాంతంలోకి వచ్చాయి. అక్కడి గేదెలు, ఆవులు, గుర్రాలు, జింకల రక్తం పీల్చేసి వాటిని చంపేశాయి. వీటి దాడిలో 400లకుపైగా పాడి పశువులు, 30 వరకు జింకలు చనిపోయాయి. ఇప్పటికే కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొటున్న రైతులు.. ప్రస్తుతం పాడిపశువులు మరణించడంతో లబోదిబో మంటున్నారు. ఈ ఘటనతో లక్ష డాలర్లకు పైగా నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు.
రంగంలోకి దిగిన అధికారులు హెలికాప్టర్ల సాయంతో దోమలమందును పిచికారి చేశారు. దీంతో పరిస్థితి కొంత అదుపులోకి వచ్చింది. అయినప్పటికి ఇంకా దోమలు పూర్తిస్థాయిలో చనిపోలేదు. ఈ రాకాసి దోమలు కేవలం పశువులనేనా.. మనుషుల మీద కూడా దాడిచేస్తాయా అన్న విషయంపై ప్రస్తుతం క్లారిటీ లేదు. అయితే ఇవి ఇప్పటివరకు మునుషుల మీద దాడిచేసిన దాఖలాలు లేవు.