Begin typing your search above and press return to search.
మొషిన్ ఫక్రజాదే దారుణ హత్య .. ట్రంప్ పై ఇరాన్ అనుమానం !
By: Tupaki Desk | 29 Nov 2020 8:10 AM GMTఇరాన్ అణు పితామహుడు మొషిన్ ఫక్రజాదే దారుణ హత్య కి గురైన సంగతి తెలిసిందే. ఈ హత్య తో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మొషిన్ ఫక్రజాదే హత్య ను ఇరాన్ ప్రధాని హసన్ రౌహనీ తీవ్రంగా ఖండించారు. ఇది పరికిపందల చర్యగా చెప్పుకొచ్చారు. దాడికి పాల్పడిన వారిపై కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని , సైనికపరంగా తమను ఎదుర్కోలేక మొషిన్ అత్యంత దారుణంగా హతమార్చరని మండిపడ్డారు. తమ శాస్త్రవేత్త హత్యతో ఇరాన్ అణ్వాయుధ సంపత్తిని, సైనిక బలాన్ని ఎవరూ అడ్డుకోలేరని , ఈ హత్య కి తగిన ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఈ హత్య పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై అనుమానం వ్యక్తం చేశారు. ఈ హత్య వెనుక ఉన్న వారి అందరి గురించి నాకు తెలుసు అంటూ , పరోక్షంగా ట్రంప్ పై హత్య వ్యాఖ్యలు చేశారు.
ఇరాన్ ఖుడ్స్ ఫోర్స్ అధిపతి ఖాసీం సులేమాని హత్యకు కారణం కూడా అమెరికానే అంటూ హసన్ రౌహానీ బహిరంగంగా ఆరోపించిన విషయం తెలిసిందే. 2012 నుంచి 2016 మధ్య నలుగురు ఇరాన్ శాస్త్రవేత్తలు హత్యకు గురైయ్యారు. వీరివెనుక ఇజ్రాయెల్ హస్తముందని రౌహానీ బలంగా వాదిస్తున్నారు. మరోవైపు శాస్త్రవేత్త హత్యపై ఇరాన్ వ్యాప్తంగా నిరసన ఆగ్రహం పెరిగిపోతుంది. దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని గట్టి నివాదాలు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇరాన్ విదేశాంగమంత్రి మహ్మద్ జావేద్ జరీఫ్ ఇజ్రాయెల్‌పై ఆరోపణలు గుప్పించారు.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఓ సందర్భంలో మాట్లాడుతూ.. మొహిన్ పేరును గుర్తుపెట్టుకోండి. ఇరాన్ లో చాలా గొప్ప, బలమైన శాస్త్రవేత్త. భవిష్యత్ లో మరోసారి ఆయన పేరును మనం వినే అవకాశం ఉందంటూ చేసిన వ్యాఖ్యలను జావేద్ గుర్తుచేశారు. అమెరికా అండతోనే ఇజ్రాయెల్ ఈ దాడికి పాల్పడిందని ఇరాన్ రక్షణ విభాగానికి చెందిన ముఖ్య అధికారి వెల్లడించారు. మరోవైపు మొహిన్ మరణంపై ఇజ్రాయెల్ మోనం వీడింది. ఆయన మృతి ఇరాన్ కు తీవ్ర నష్టం చేకూర్చుతుందని పేర్కొంటూ ఓట్వీట్ చేసింది. దీనిని డొనాల్డ్ ట్రంప్ రీట్వీట్ చేయడం గమనార్హం. కాగా ఇరాన్- అమెరికా మధ్య దశాబ్దాల కాలంగా వైరం కొనసాగుతున్న విషయం తెలిసిందే.