Begin typing your search above and press return to search.

సోనియా.. అస‌ద్‌.. సౌదీ రాజు కాళ్ల‌కు మొక్కిన మోడీ?

By:  Tupaki Desk   |   15 April 2019 5:25 AM GMT
సోనియా.. అస‌ద్‌.. సౌదీ రాజు కాళ్ల‌కు మొక్కిన మోడీ?
X
ప్ర‌త్య‌ర్థికి పంచ్ ఇవ్వాలంటే నేరుగా ఇవ్వాలి. అంతేకానీ.. చీప్ ట్రిక్స్ ను ప్లే చేయ‌టంతో పంచ్ కాదు.. రివ‌ర్స్ పంచ్ ప‌డుతుంది. తాజాగా వైర‌ల్ అవుతున్న ఫోటోలు కూడా అలాంటివే. ఎట‌కారం చేయ‌టం త‌ప్పు కాదు కానీ ఆ పేరుతో చేస్తున్న వికార‌పు ప‌నులు చిరాకు పుట్టించేలా మారాయి. దేశ వ్యాప్తంగా జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌ర్థుల్ని టార్గెట్ చేసేందుకు అనుస‌రిస్తున్న విధానాలు త‌ప్పు ప‌ట్టేలా సాగుతున్నాయి.

తాజాగా అలాంటి ఫోటోలు కొన్ని వైర‌ల్ అవుతున్నాయి. మోడీని బ‌ద్నాం చేసేందుకు.. ఆయ‌న్ను ఎట‌కారం చేసుకునేందుకు అనుస‌రిస్తున్న పద్ద‌తి ఏ మాత్రం అభినందించేదిగా లేక‌పోవ‌టం గ‌మ‌నార్హం. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. యూపీఏ ఛైర్ ప‌ర్స‌న్ సోనియాగాంధీకి పాదాభివంద‌నం చేస్తున్న ఫోటోను పోస్ట్ చేశారు. చూసినంత‌నే నిజ‌మ‌నిపించేలా ఉన్న ఈ ఫోటో పైన రూ.72 వేల గురించి.. రూ.22 లక్ష‌ల ఉద్యోగాల గురించి మాట్లాడొద్ద‌ని.. ద‌య‌చేసి మీ అబ్బాయికి చెప్పండి.. లేకుంటే నేను మ‌ళ్లీ గుజ‌రాత్ కు వెళ్లిపోవాలి. అక్క‌డ నేను కోసే కోత‌ల గురించి న‌మ్మేవారెవ‌రూ లేరంటూ వ్యాఖ్య రాశారు.

2013 సెప్టెంబ‌రులో భోపాల్ లో జ‌రిగిన బీజేపీ ర్యాలీలో బీజేపీ కురువృద్ధుడు అద్వానీ కాళ్ల‌కు మోడీ మొక్కారు. ఈ సంద‌ర్భంగా తీసిన ఫోటోను.. మార్చేసి అద్వానీ ప్లేస్ లో సోనియ‌మ్మ ఫోటోను పేస్ట్ చేశారు. ఇదే రీతిలో మ‌జ్లిస్ అధినేత అస‌దుద్దీన్ ఓవైసీ.. సౌదీ రాజు కాళ్ల‌కు మొక్కుతున్న మోడీ ఫోటోల్ని వైర‌ల్ చేస్తున్నారు. ఇలాంటి ఫోటోలు ప్ర‌జ‌ల్ని ఆక‌ట్టుకోవ‌టం కంటే కూడా.. అతి చేస్తున్నార‌న్న భావ‌న క‌లిగేలా ఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మోడీ త‌ప్పుల్ని స‌మ‌ర్థంగా ఎత్తి చూపాలే కానీ.. ఇలాంటి ఎట‌కార‌పు పోస్టుల‌తో మైలేజీ అస్స‌లు రాద‌న్న విష‌యాన్ని గుర్తిస్తే మంచిది.