Begin typing your search above and press return to search.
100 మంది మహిళలను బ్లాక్ మెయిల్ చేసిన వ్యక్తి అరెస్ట్ ... ఎలా చేశాడంటే ?
By: Tupaki Desk | 31 Dec 2020 12:30 AM GMTరోజురోజుకి పెరుగుతున్న టెక్నాలజీ తో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో , అంతకుమించి అనర్దాలు కూడా ఉన్నాయి. కొంతమంది సాంకేతిక పరిజ్ఙానంను మంచికి ఉపయోగిస్తే , మరికొంతమంది చెడుకి ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్ వాడకం పెరిగిపోయిన తర్వాత ఎన్నో అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నాయి. కొన్ని సంవత్సరాలుగా బాగా పాపులర్ అయిన సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో పోస్ట్ చేసుకున్న పర్సనల్ ఫోటోలు డౌన్ లోడ్ చేసి వాటిని అసభ్యంగా మార్ఫింగ్ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని మహిళలను బ్లాక్ మెయిల్ చేస్తున్న వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ వ్యవహారం పై పూర్తి వివరాల్లోకి వెళ్తే .. దేశ రాజధాని ఢిల్లీ నగరానికి చెందిన సుమిత్ ఝా అనే వ్యక్తి మొదట మహిళల సోషల్ మీడియా అకౌంట్ ప్రొఫైల్ ఫోటోలను డౌన్ లోడ్ చేసి, ఆ తరువాత వాటిని మార్ఫ్ చేసేవాడు. తర్వాత సేమ్ సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి, ఆ ఫోటోలను ఆ మహిళలకే పంపి.. అడిగినంత డబ్బు ఇవ్వాలని.. లేదంటే వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరింపులకు దిగేవాడు.ఇలా దాదాపు 100 మహిళలను బ్లాక్‌మెయిల్ చేశాడు.
ఇలాగే బ్యాంక్ మేనేజర్ గా పని చేస్తున్న ఓ మహిళను కూడా బెదిరించేందుకు ప్రయత్నించాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు, పోలీసులకు దొర్కకుండా ఉండేందుకు నిందితుడి వాట్సాప్ ద్వారా వీఓఐపీ కాల్స్, వేరే యాప్స్ ద్వారా బెదిరింపులకు దిగేవాడు. నిందితుడిని పట్టుకోవటం కాస్త కష్టంగా మారటంతో, సర్వీసు ప్రోవైడర్ సహకారంతో, సాంకేతికంగా ఆధారాలు సేకరించి, నిందితుడిపై ఇన్పార్మర్ల నిఘా పెట్టి మంగళవారం అరెస్ట్ చేశారు.నిందితుడిని గతంలో ఇదే నేరం కింద చత్తీస్‌గఢ్, నోయిడాలో రెండు సార్లు అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.నిందితుడు ఇప్పటి వరకు బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడి దాదాపు 100 మంది మహిళలను బెదిరించి వారి వద్దనుంచి డబ్బులు వసూలు చేసినట్లు దక్షిణ ఢిల్లీ డీసీపీ అతుల్ ఠాకుర్ తెలిపారు.