Begin typing your search above and press return to search.

ఏపీలో ఇక ‘ట్రూనాట్ టెస్టులు’.. కరోనా పరీక్షల్లో పెరగనున్న వేగం!

By:  Tupaki Desk   |   27 April 2021 5:30 AM GMT
ఏపీలో ఇక ‘ట్రూనాట్ టెస్టులు’.. కరోనా పరీక్షల్లో పెరగనున్న వేగం!
X
ఇప్ప‌టి వ‌ర‌కు అనుస‌రిస్తున్న కొవిడ్ ప‌రీక్ష‌ల‌ విధానం ఆల‌స్య‌మ‌వుతోంద‌ని.. ఏపీ ప్ర‌భుత్వం స‌రికొత్త విధానాన్ని అమ‌లు చేయ‌బోతోంది. వైర‌స్ బాధితుల ప్రైమ‌రీ కాంటాక్టుల నుంచి న‌మూనాలు సేక‌రించి, వెంట‌నే ప‌రీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ టెస్టులు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి.

ఈ కొత్త విధానంలో ట్రూనాట్ మిష‌న్ల‌పై కొవిడ్ టెస్టులు చేస్తారు. దీనిద్వారా రిపోర్టులు వేగంగా రానున్నాయి. ఈ మిష‌న్ల‌ ద్వారా రోజుకు 600 నుంచి 900 వ‌ర‌కు టెస్టులు చేసేందుకు అవ‌కాశం ఉంది. అయితే.. పాత ప‌ద్ధ‌తి కూడా కొన‌సాగుతుంది. ఎమ‌ర్జెన్సీ కేసులు, ఆప‌రేష‌న్లు చేయాల్సిన వారికి ఈ ప‌ద్ధ‌తి ద్వారా ప‌రీక్ష‌లు చేస్తారు.

ఇప్ప‌టికే.. భీమ‌వ‌రం, ఏలూరు, తాడేప‌ల్లిగూడెంలోని ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో ఈ ట్రూనాట్ మిష‌న్లు ఏర్పాటు చేశారు. ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లు వాడ‌డం ద్వారా ఈ మిష‌న్ల‌పై కొవిడ్ పరీక్ష‌లు చేస్తారు. వీటికోసం సోమ‌వారం 4 వేల కిట్లు అందుబాటులోకి వ‌చ్చాయి.

రోజురోజుకూ కేసుల ఉధృతి పెరుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం స‌త్వ‌ర చ‌ర్య‌లు తీసుకుంటోంది. ప్ర‌జ‌లకు క‌ఠిన ఆదేశాలు జారీచేసిన స‌ర్కారు.. రాత్రి క‌ర్ఫ్యూ కూడా విధించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు కొవిడ్ ప‌రీక్ష‌ల‌కు ట్రూనాట్ మిషన్ల‌ను అందుబాటులోకి తేవ‌డంతో.. వైర‌స్ బాధితుల‌ను మ‌రింత త్వ‌ర‌గా గుర్తించే వీలు క‌ల‌గ‌నుంది.