Begin typing your search above and press return to search.
అవినాష్ కు సుప్రీంకోర్టులో దక్కని ఊరట!
By: Tupaki Desk | 22 May 2023 11:59 AM GMTదివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తమ్ముడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు అనేక మలుపులు తిరుగుతోంది. విచారణకు రావాలని ఈ హత్య కేసులో సహ నిందితుడు అయిన కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ ఇప్పటికే రెండుసార్లు నోటీసులు జారీ చేయగా ఆయన విచారణకు డుమ్మా కొట్టారు. తాజాగా మరోమారు సీబీఐకి లేఖ రాశారు. తన తల్లికి ఆరోగ్యం బాగోలేదని.. అందువల్ల మే 22న సోమవారం విచారణకు హాజరుకాలేనని వెల్లడించారు. ఈ మేరకు సీబీఐకి అవినాష్ లేఖ రాశారు. తద్వారా ముచ్చటగా మూడోసారి సీబీఐ విచారణకు డుమ్మా కొట్టారు.
మరోవైపు వివేకా హత్య కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని అవినాష్ రెడ్డి మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను ఆయన న్యాయవాదులు వెకేషన్ బెంచ్ ముందు మెన్షన్ చేశారు. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జేకే మహేశ్వరి, పీఎస్ నరసింహలతో కూడిన వెకేషన్ బెంచ్ ముందు అవినాశ్ న్యాయవాదులు తన బెయిల్ పిటిషన్ ను మెన్షన్ చేయగా ఈ పిటిషన్ ను వెంటనే విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించలేదు. ప్రస్తుతం ఈ పిటిషన్ ను విచారించలేమని పేర్కొంది.
గతంలోనూ హైకోర్టు వెకేషన్ బెంచ్ తన బెయిల్ పిటిషన్ విచారించేలా ఆదేశించాలని సుప్రీంలో అవినాష్ రెడ్డి పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీన్ని కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. సీబీఐ అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వబోమని సుప్రీంకోర్టు తెలిపింది. ముందస్తు బెయిల్ విషయం తెలంగాణ హైకోర్టే తేల్చాలని గత విచారణలో సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వలేమని వెల్లడించింది. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేశారు.
సీబీఐ విచారణకు మూడోసారి డుమ్మాకొట్టిన నేపథ్యంలో సీబీఐ తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని అవినాష్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ సుప్రీం వెకేషన్ బెంచ్ ముందు తన బెయిల్ పిటిషన్ ను అవినాశ్ రెడ్డి ఉంచారు. దీన్ని సుప్రీంకోర్టు వెంటనే విచారించలేమని వెల్లడించింది.
కాగా అవినాష్ రెడ్డిని అరెస్టు వార్తలపై మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనను అరెస్టు చేస్తే లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తుతాయని అన్నారు. కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రికి వైసీపీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నాయన్నారు. తన తల్లి ఆరోగ్యం బాగవగానే అవినాష్ రెడ్డి సీబీఐకి సహకరిస్తానని వెల్లడించారు.
ఇంకోవైపు సీబీఐ విచారణకు వరుసగా మూడోసారి కూడా వైఎస్ అవినాష్ రెడ్డి డుమ్మా కొట్టిన నేపథ్యంలో సీబీఐ అధికారులు ఆయనను అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతోంది. భారీగా సీబీఐ అధికారులు కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రికి చేరుకున్నాయి. దీంతో ఏం జరుగుతుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.