Begin typing your search above and press return to search.
ఇండియా జనాభా లో సగానికి పైగా... కరోనా@76 కోట్లు
By: Tupaki Desk | 24 Feb 2022 1:30 AM GMTదేశంలో కరోనా కేసుల సంఖ్య 76 కోట్లకు చేరింది. వైరస్ మన దేశం లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి ఇప్పటివరకు చేసిన పరీక్షల సంఖ్య 76 కోట్లకు చేరిందని కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. అంటే మన దేశ జనాభా లోని సగం అన్నమాట. అయితే వీరిలో ఒక్కొక్కరు కనీసం రెండు మూడు సార్లు చేసుకున్న వాళ్లు కూడా ఉన్నారు. కరోనా సోకిన కూడా ఎటువంటి పరీక్షలు చేయించుకోకుండా... వైరస్ నుంచి విముక్తి పొందిన వారు కూడా ఉన్నారు.
కొన్ని ప్రయాణాలు, వివిధ రకాల ఎంట్రీల కోసం కరోనా టెస్ట్ రిపోర్టును తప్పనిసరి చేశారు. అందుకోసం ఎటువంటి లక్షణాలు లేకపోయినా కూడా చాలామంది పరీక్షలు చేయించుకున్నారు. మరికొందరు సాధారణ జలుబు, జ్వరం వచ్చినా కోవిడ్ టెస్టులకు వెళ్లారు. ఇంకొందరు స్వల్ప లక్షణాలతో పరీక్షలు చేయించుకున్నారు.
ఇలా రకరకాల ఉద్దేశాలతో దేశంలో 76 కోట్ల కరోనా నిర్ధారణ పరీక్షలు జరిగాయి. పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగా ఉన్న ఈ సమయంలో కూడా పరీక్షల సంఖ్య మాత్రం అధికంగానే ఉంది. గడిచిన 24 గంటల్లో 11 లక్షలకు పైగా కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.
జనవరి నెల చివరి నుంచి కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతూ వస్తోంది. థర్డ్ వేవ్ ప్రమాదం ఉంటుందని... వైద్య నిపుణులు హెచ్చరించారు. అయితే మూడో దశ ప్రమాదం ఎక్కువగా లేదనే చెప్పాలి. జనవరి నాలుగో వారం నుంచి పాటిజివ్ కేసుల సంఖ్య క్రమంగా దిగువకు వస్తుంది.
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11 లక్షల మందికి పరీక్షలు నిర్వహిస్తే 15 వేల మందికి మాత్రమే వైరస్ సోకింది. మరికొన్ని రోజుల్లో ఈ సంఖ్య ఇంకా కనిష్ఠానికి పడిపోతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం కరోనా ఉనికి తక్కువగానే ఉందని అంటున్నారు.
గతేడాది చివర్లో దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ అనే వేరియంట్ ఉద్భవించింది. ఈ వేరియంట్ కు వేగంగా వ్యాపించే లక్షణాలు కలిగి ఉంది. అందుకే గతేడాది డిసెంబర్ రెండో వారం నుంచి కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా వైరస్ ఉధృతి మరింత పెరిగింది.
కాగా థర్డ్ వేవ్ ఆరంభమైందని హెచ్చరికలు వచ్చాయి. అయితే చాలామంది కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఆ ముప్పు వేగంగా వీడింది. దాదాపు నెల రోజుల నుంచి అన్ని కార్యక్రమాలు సాధారణంగా సాగుతున్నాయి. పాఠశాలలు, కళాశాల్లోనూ ప్రత్యక్ష బోధన సాఫీగా సాగుతోంది.