Begin typing your search above and press return to search.

సహాయం కోసం భారత్‌ వైపు ప్రపంచ దేశాల చూపు!

By:  Tupaki Desk   |   7 April 2020 1:32 AM GMT
సహాయం కోసం భారత్‌ వైపు ప్రపంచ దేశాల చూపు!
X
భూగోళమంతా కరోనా వైరస్‌ వ్యాపించింది. ఈ కరోనా ధాటికి ప్రపంచ దేశాలన్నీ వణుకుతున్నాయి. కరోనా వైరస్‌ నివారణకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నాయి. అయితే కరోనా బాధితులకు అందిస్తున్న మందు దాదాపు అన్ని దేశాల్లో అయిపోయింది. దీంతో ఆ దేశాలు కలవర పడుతున్నాయి. తమ వద్ద మందుల కొరత ఏర్పడడంతో అగ్రరాజ్యం అమెరికా తో పాటు ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూస్తున్నాయి. భారతదేశ సహాయం కోసం అర్జిస్తున్నాయి. ఇటీవలనే అమెరికా అధ్యక్షుడు డొనల్డ్‌ ట్రంప్‌ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సహాయం చేయాలని కోరిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు మరికొన్ని దేశాలు భారత సహాయాన్ని కోరుతున్నాయి.

ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్‌ తీవ్రమవుతున్నా.. ప్రపంచ దేశాలతో పోలిస్తే కొంత మెరుగ్గానే ఉన్నా ముందే స్పందించి లాక్‌ డౌన్‌ విధించడంతో ఆ వైరస్‌ కొత్త మార్గాల ద్వారా విస్తరించడం లేదు. దీంతో పాటు కరోనా నివారణకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటుండడంతో ప్రపంచదేశాలన్నీ భారతదేశం వైపు చూస్తున్నాయి. భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికా కూడా ప్రశంసలు కురిపించింది. అయితే మలేరియా నివారణకు వినియోగించే హైడ్రాక్సీ ‍ క్లోరోక్వీన్‌ - పారాసిట్‌మాల్‌ మాత్రలు వాడుతున్నారు. ఆ మందు దాదాపు అన్ని దేశాల్లో అయిపోతోంది. ఆ దేశాల్లో తీవ్ర కొరత ఉంది. ముఖ్యంగా లక్షల్లో కేసులు నమోదవుతుండడంతో వారందరికీ వైద్యం అందించడం.. మందులు ఇవ్వడం అగ్రరాజ్యం అమెరికాకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఆ దేశంలో హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌ కొరత ఏర్పడింది. దీంతో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆ దేశ అధ్యక్షుడు డొనల్డ్‌ ట్రంప్‌ స్వయంగా ఫోన్‌ చేసి.. ఆ మందుపై ఉన్న నిషేధం ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. అమెరికన్‌ కంపెనీలు ఆ మందు కోసం భారత్‌ ను కోరుతున్నాయి. ఇక వాటితో పాటు సార్క్‌ దేశాలతో పాటు మరో 30 దేశాలు కూడా ఆ మందు కోసం మనదేశాన్ని కోరుతున్నాయి. హైడ్రాక్సీ ‍క్లోరోక్వీన్‌ పై ఉన్న నిషేధం ఎత్తివేసి ఆ మందును ఎగుమతులు చేసి తమను ఆదుకోవాలని ప్రపంచ దేశాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.

అయితే వారి విజ్ఞప్తులను భారత ప్రభుత్వం నిరాకరిస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కుదరదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం టాబ్లెట్ల వినియోగం పెద్ద ఎత్తున ఉండడంతో వీలైనంత స్టాక్‌ ను తమ వద్ద ఉంచుకోవాలని మన దేశం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ మందు పై నిషేధం ఎత్తేసి ఎగుమతి చేయలేమని స్పష్టం చేస్తోంది. దీంతో అమెరికా తో పాటు ఇతర దేశాలకు తీవ్ర నిరాశ ఎదురవుతోంది. కరోనా కంట్రోల్‌ లోకి వస్తే ఆ మందు ఎగుమతి చేసేవారం. కానీ ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్‌ ఇంకా తీవ్రంగా వ్యాపిస్తూనే ఉంది. అందుకే మన ప్రజల అవసరాల దృష్ట్యా ఇతర దేశాలకు ఎగుమతి చేయడం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేస్తున్నారు.