Begin typing your search above and press return to search.

27 కోట్ల ఫేస్ బుక్ యూజర్ల డేటా ఆన్ లైన్ లోకి వచ్చేసిందట

By:  Tupaki Desk   |   21 Dec 2019 4:54 AM GMT
27 కోట్ల ఫేస్ బుక్ యూజర్ల డేటా ఆన్ లైన్ లోకి వచ్చేసిందట
X
ఇటీవల కాలంలో ఫేస్ బుక్ టైం ఏమీ బాగున్నట్లుగా అనిపించట్లేదు. కొద్ది నెలల క్రితం యూజర్ డేటా లీక్ అయిన ఉదంతంలో తలనొప్పులు ఎదుర్కొన్న ఫేస్ బుక్ తాజాగా మరోసారి అలాంటి షాక్ నే ఎదుర్కొంది. సుమారు 27 కోట్ల మంది కి చెందిన యూజర్ల డేటా బయటకు వచ్చినట్లుగా చెబుతున్న సమాచారం ఇప్పుడు సంచలనంగా మారింది.

కంపారిటెక్ సెక్యురిటీ పరిశోధకుడు జాబ్ విడుదల చేసిన నివేదిక లో ఫేస్ బుక్ యూజర్ల కు సంబంధించిన డేటా లీక్ అయినట్లుగా సంచలన ఆరోపణలు చేశారు. ఆయన నివేదిక ప్రకారం 276 మిలియన్ల ఫేస్ బుక్ యూజర్లకు సంబంధించి యూజర్ ఐడీలు.. ఫోన్ నంబర్లు..పేర్లు లాంటి వ్యక్తిగత వివరాలు ఇంటర్నెట్ లోని హ్యాకర్ల ఫోరంలో సిద్ధంగా ఉన్నాయన్నారు.

కావాల్సిన వారు సులువుగా డౌన్ లోడ్ చేసుకునే వీలుందని చెబుతున్నారు. ఈ సందర్భంగా ఫేస్ బుక్ లోని సాంకేతిక లోపాన్ని వెల్లడించారు. ఫేస్ బుక్ లోని అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ ఫేస్ లో ఉన్న సెక్యురిటీ లోపం తో కానీ పబ్లిక్లీ విజిబుల్ ప్రొఫైల్ అని ఉన్న యూజర్స్ ఖాతాల ుంచి కానీ డేటాను చోరీ చేసి ఉండొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జాబ్ నివేదిక తో ఫేస్ బుక్ అలెర్ట్ అయ్యింది. ఈ అంశంపై తాము విచారణ జరుపుతున్నట్లు గా పేర్కొంది. భద్రత విషయం లో మార్పులు చేస్తున్నట్లు చెప్పిందే తప్పించి.. డేటా బయటకు లీక్ అయ్యిందన్న వార్తల్నిమాత్రం అంగీకరించ లేదు. ఇంతకీ ఫేస్ బుక్ డేటా లీక్ అయ్యిందా? లేదా? అన్నది తేల్లేదు.