Begin typing your search above and press return to search.

2000 పైగా శవాలు గంగానదిలో.. రాహుల్ ట్వీట్

By:  Tupaki Desk   |   16 May 2021 1:04 PM IST
2000 పైగా శవాలు గంగానదిలో.. రాహుల్ ట్వీట్
X
కరోనా కల్లోలంతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. శవాలను తగుల బెట్టడానికి కూడా ఉత్తరప్రదేశ్ లో కర్రల కొరత వల్ల నదుల తీరాల్లోనే శవాలను పూడ్చి పెడుతున్న వార్తలు మీడియాలో వచ్చాయి.. కొన్ని శవాలను గంగా నదిలోనే వదిలేస్తున్న పరిస్థితి నెలకొంది.

ఈ క్రమంలోనే గత కొద్దిరోజులుగా ఉత్తరప్రదేశ్ ఘాజీపూర్ లోని గంగానదిలో మరోసారి పెద్ద సంఖ్యలో మృతదేహాలు కనిపించాయి. అయితే ఇవి కోవిడ్ మృతదేహాలా? కాదా? అనే విషయాన్ని మాత్రం అధికారులు ఇంకా నిర్ధారించలేదు.

ఈ ఉదయం మృతదేహాలు నదిలో కొట్టుకురాగా.. దూరంగా ఉన్న ఇసుక దిబ్బల్లో స్థానికులు వీటిని గుర్తించారు. ఇటీవల గంగానదిలో కోవిడ్ మృతదేహాలను ఖననం చేస్తున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో భౌతిక కాయాలు ఇలా నదిలో కనిపించడం తీవ్ర ఆందోళనకు కారణమైంది.

గంగానదిలో శవాలు కనిపించడంపై కాంగ్రెస్ నేత రాహుల్ స్పందించారు. ట్విట్టర్ లో మోడీపై పరోక్ష విమర్శలు చేశారు. గంగానది పిలుస్తోందని వ్యాఖ్యలు చేసిన వారే ఇప్పుడు నదిని పిలిపించేలా చేస్తున్నారంటూ రాహుల్ విమర్శించారు.

గంగానదిలో శవాలు కొట్టుకురావడంపై ఈ మేరకు ట్విట్టర్ లో విమర్శించారు. 1140 కి.మీల పొడవైన గంగానది తీరప్రాంతంలో ఇప్పటివరకు 2వేలకు పైగా శవాలను గుర్తించినట్టు పేర్కొన్న ఓ వార్తను రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. మోడీ సార్ పాలనలో ఇలా శవాలను నదిలో వదిలేస్తున్నారని రాహుల్ గాంధీ పరోక్ష విమర్శలు చేశాడు.

కాగా కొద్దిరోజులుగా గంగానది పరివాహక ప్రాంతంలోని ఉత్తరప్రదేశ్, బీహార్ లలోని గంగానదీ పరివాహక ప్రాంతాల్లో అనేక శవాలను అధికారులు గుర్తించారు.