Begin typing your search above and press return to search.
ఆన్ లైన్ లో మహిళలపై దాడి.. ఆ టూల్ తో లక్షమంది నగ్న చిత్రాలు
By: Tupaki Desk | 22 Oct 2020 5:30 AM GMTఇక ముందు సోషల్ మీడియాలో.. ఆన్ లైన్ లో ఫొటోలు పెట్టేముందు అమ్మాయిలు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. మహిళపై కొత్తరకం దాడి మొదలైంది. ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మహిళల సాధారణ ఫొటోలను ఒరిజినల్ లా కనిపించే (డీప్ ఫేక్) నకిలీ నగ్న చిత్రాలుగా మలిచే ఒక టూట్ ను సైబర్ నేరస్థులు అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఇప్పటికే ఈ టూల్ ద్వారా లక్షమంది మహిళలను టార్గెట్ చేశారని.. ఓ సైబర్ రీసెర్చ్ ట్రాకింగ్ ఏజెన్సీ నివేదిక వెల్లడించింది. ఈ టూల్ ద్వారా ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, టెలిగ్రామ్ తదితర ఆన్ లైన్ ఫ్లాట్ పామ్స్ లో అందుబాటులో ఉండే ఏ మహిళ ఫొటోనైనా నగ్న చిత్రంగా మలచవచ్చు.
మొదట్లో కొందరు కేటుగాళ్లు సెలబ్రిటీల ఫొటోలను ఉపయోగించి పోర్నోగ్రఫీ కోసం ఇలాంటి డీప్ ఫేక్ లను సృష్టించేవారు. ఇప్పుడు సాధారణ మహిళలు కూడా దీని బారినపడుతున్నారు.
తాజాగా సైబర్ రీసెర్చ్ ట్రాకింగ్ ఏజెన్సీ నివేదిక సంచలన విషయాన్ని బయటపెట్టింది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టూల్ ను ఉపయోగించి 2020 జులై నాటికి ఏకంగా 1,04,852 మంది మహిళల నగ్న చిత్రాలను క్రియేట్ చేశారు. వాటిని పబ్లిక్ ఫాట్ ఫామ్స్ అయిన సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. గడిచిన 3 నెలల్లో ఈ నగ్న చిత్రాల సంఖ్య ఏకంగా 198శాతం పెరిగింది. ఈ డీప్ ఫేక్స్ ను క్రియేట్ చేసిన యూజర్స్ లో 1,04,000 మంది రష్యా నుంచే ఉన్నారు అని సైబర్ రీసెర్చ్ ట్రాకింగ్ ఏజెన్సీ నివేదిక వెల్లడించింది.
ప్రస్తుతం ఈ డీప్ టూట్ ఉచితంగా ఆన్ లైన్ లో దొరుకుతోంది. ఒకసారి డీప్ ఫేక్ ను క్రియేట్ చేశాక.. దాన్ని తొలగించాలంటే 1.5 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఏ మహిళ ఫొటోనైనా ఇందులో నగ్నంగా మార్చేయవచ్చు. ఈ సాఫ్ట్ వేర్ ను 2019లో అనామక వ్యక్తులు అందుబాటులోకి తెచ్చారు. ఈ సాఫ్ట్ వేర్ సృష్టికర్తలు రష్యాన్లే అన్న ప్రచారం ఉంది.