Begin typing your search above and press return to search.

ఏపీలో జనాభా కంటే మొబైల్స్ ఎక్కువ

By:  Tupaki Desk   |   22 Aug 2016 6:15 AM GMT
ఏపీలో జనాభా కంటే మొబైల్స్ ఎక్కువ
X
సెల్ ఫోన్స్ విషయంలో ఇప్పటికే ఎన్నోరకలా జోక్స్ ప్రాచుర్యంలో ఉన్నాయి. అన్నంలేకపోయినా పర్లేదు, బట్టలేకపోయినా పర్లేదు.. మొబైల్ మస్ట్! బయటకు వెళ్తున్నప్పుడు పర్సుమరిచిపోయినా పర్లేదు కానీ, మెబైల్ ఫోన్ మరిచిపోతే కష్టం. ఉదయం లేచినప్పటినుండి, రాత్రి నిద్రపోయేవరకూ మొబైల్ ఫోన్ మనిషి శరీరంలో ఒక అవయువంతో సమానమైపోయింది. ఈ రేంజ్ లో మొబైల్ ఫోన్ - మనిషి బందాన్ని నిర్వచిస్తుంటారు. అయితే ఈ విషయంలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక సంఘటన ఈ విషయానికి బలాన్ని చేకూరుస్తుంది. ప్రపంచంలోనే మొబైల్ ఫోన్లకు పెద్ద మార్కెట్ అయిన ఇండియాలో ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి మొబైల్ కనెక్షన్ల సంఖ్య 1,026 మిలియన్లకు చేరిన సంగతి అలా ఉంటే.. ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక కొత్త రికార్డు నమోదైంది.

ఆంధ్రప్రదేశ్‌ లో ఉన్న జనాభా కంటే మొబైల్ ఫోన్స్ ఎక్కువగా ఉన్నాయట. అర్బన్ - సెమీ అర్బన్‌ గా రూపుదిద్దుకుంటున్న ప్రాంతాల్లో మొబైల్ కనెక్షన్ల సంఖ్య విపరీతంగా పెరిగినట్టు నిపుణులు చెబుతున్నారు. ఇంటర్నెట్ కోసం స్టూడెంట్స్ ఒకటి కంటే ఎక్కువ కనెక్షన్లు తీసుకోవడం, ఇంకొందరైతే రెండేసి మొబైళ్లను వినియోగించడం, ఈ మధ్యకాలంలో రెండు సిం ల ఫోన్లు, మూడు సిం ల ఫోన్లూ విరివిగా దొరకడం, ఆండ్రాయిడ్ ఫోన్ల ద్వారా ఇంటర్నెట్ సదుపాయాన్ని సులువుగా వినియోగించుకునే వీలుండడం, అందరికీ ఫేస్ బుక్ - వాట్సప్ వంటి సోషల్ నెట్ వర్క్స్ లో యాక్టివ్ గా ఉండే అలవాటు రావడం, పర్సనల్ ఫోన్ వేరు, ప్రొఫెషనల్ ఫోన్ వేరు అనేలా డివైడ్ అయిపోవడం వీటికి కారణాలుగా భావిస్తున్నారు నిపుణులు. ఈ కారణాలతో రాష్ట్ర జనాభా 4.95 కోట్లు ఉంటే మొబైల్ కనెక్షన్లు మాత్రం 7.48 కోట్లుగా ఉందట.

ఇక పేద, మధ్యతరగతి, బీపీఎల్ ప్రజలు.. ఇలా ఆర్థిక స్థోమతతో ఏమాత్రం సంబందం లేకుండా ఈ మొబైల్ వినియోగం పెరిగిపోతుంది. ఈ విషయంలో భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ మొబైల్ కనెక్షన్ల విషయంలో కూడా ఫస్ట్ ప్లేస్‌లో నిలవగా తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర - తమిళనాడు - ఆంధ్రప్రదేశ్ - బీహార్ లు నిలిచాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... వైజాగ్ ఏజెన్సీ ప్రాంతంలో అయితే నక్సల్స్ కూడా సెల్‌ ఫోన్స్ ఎక్కువగానే వినియోగిస్తున్నారట.