Begin typing your search above and press return to search.

పనామా పేపర్లు... సెకండ్ లిస్టొచ్చేసింది..

By:  Tupaki Desk   |   5 April 2016 1:02 PM IST
పనామా పేపర్లు... సెకండ్ లిస్టొచ్చేసింది..
X
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పనామా పేపర్లలో ఉన్న పేర్లతో మరో జాబితా కూడా వెల్లడైంది. ఈ సెకండ్ లిస్టులోనూ భారతీయుల పేర్లున్నాయి. మాజీ క్రికెటర్ అశోక్ మల్హోత్రా - క్రాంప్టన్ గ్రీవ్సు చైర్మన్ గౌతమ్ థాపర్ - మెహ్రా సన్సు జ్యూయెలరీస్ అధినేత అశ్వనీ కుమార్ తదితరుల పేర్లున్నాయి.

కాగా, విదేశాల్లో నల్లధనం దాచుకున్నారని చెబుతూ, నిన్న విడుదలైన తొలి జాబితాలో పలువురు దేశాధినేతలు - మాజీ ప్రధానులు - సెలబ్రిటీల పేర్లు వెల్లడి కాగా, వారిలో అత్యధికులు తమకు నల్లధనంతో సంబంధం లేదని ఖండించిన సంగతి తెలిసిందే. మరోవైపు పలు దేశాలు ఈ ఆరోపణలపై స్వీయ విచారణలకు ఆదేశాలు జారీ చేశాయి. భారత్ లోనూ దీనిపై విచారణకు గాను కేంద్రం ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ కమిటీ వేయడం కంటే సుప్రీం కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపడం బెటరని కాంగ్రెస్ సహా విపక్షాలు డిమాండు చేస్తున్నాయి.

మరోవైపు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి సన్నిహితంగా ఉన్నవారిలో చాలామంది నల్లధన జాబితాలో ఉండడంతో బీజేపీ దీనిపై పారదర్శకంగా విచారణ జరిపే అవకాశం లేదన్న విమర్శలొస్తున్నాయి.