Begin typing your search above and press return to search.

మరో 108 మంది భూములిచ్చేశారు

By:  Tupaki Desk   |   21 Aug 2015 7:14 AM GMT
మరో 108 మంది భూములిచ్చేశారు
X
ఏపీ రాజధానిలో భూమి సమీకరణకు సంబంధించి ముందుగా అనుకున్న గడువు ముగిసిన నేపథ్యంలో తాజాగా ఏపీ సర్కారు భూములు ఇవ్వని రైతుల వద్ద నుంచి బలవంతంగా తీసుకునేందుకు భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేయగా.. మరో నోటిఫికేషన్ ను శనివారం జారీ చేయనున్న సంగతి తెలిసిందే.

ఇప్పటివరకూ పెద్దగా వివాదాల్లేకుండా సాగిపోయిన భూసమీకరణ స్థానే.. భూసేకరణతో భూములు సేకరించే విషయంలో కటువుగా వ్యవహరించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉండటంతో.. చివరి క్షణాల్లో 108 మంది రైతులు తమ భూముల్ని భూసమీకరణ కింద ఇచ్చేందుకు ముందుకొచ్చారు. వీరికి చెందిన 123 ఎకరాలను ఏపీ సర్కారు ఇచ్చేశారు.

భూసమీకరణ కింద భూములు ఇచ్చే వారికి ప్రభుత్వం నుంచి పలు ప్రయోజనాలు పొందే వీలుంది. దీర్ఘకాలం కౌలు మొత్తం పొందటంతో పాటు.. వాటా తీసుకునే వెసులుబాటు ఉంది. అదే భూసేకరణ చట్టం ప్రకారం భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే నష్టపరిహారం కింద ప్యాకేజీ తప్పించి.. సమీకరణ సందర్భంగా భూములిచ్చిన వారికి అందే రాయితీలు ఏమీ వీరికి అందవు. దీంతో.. ఆఖరి నిమిషాల్లో 108 మంది భూములు స్వయంగా ఇచ్చేయటం గమనార్హం.