Begin typing your search above and press return to search.

మరిన్ని డేంజర్​ వైరస్​లు పొంచి ఉన్నాయి.. మానవాళి అప్రమత్తంగా ఉండాల్సిందే!

By:  Tupaki Desk   |   31 Oct 2020 9:10 AM GMT
మరిన్ని డేంజర్​ వైరస్​లు పొంచి ఉన్నాయి.. మానవాళి అప్రమత్తంగా ఉండాల్సిందే!
X
ఇప్పటికే కరోనా వైరస్​ సృష్టించిన అల్లకల్లోలం అవుతున్న ప్రజలకు శాస్త్రవేత్తలు మరో పిడుగు లాంటి వార్తలు చెప్పారు. రానున్న రోజుల్లో కరోనాను మించిన వైరస్​లు దాడి చేసే అవకాశం ఉన్నదని హెచ్చరించారు. ఇటీవల జెనీవాలో ఇంటర్​ గవర్నమెంట్ సైన్స్​ పాలసీ పల్ఆట్​ఫాం ఆన్​ బయోడైవర్సిటీ, ఎకో సిస్టమ్​ ఐపీబీఎస్​ వర్క్​షాప్​ నిర్వహించారు. ఈ వర్కషాప్​ పాల్గొన్న శాస్త్రవేత్తలు రానున్న రోజులు ఎంత భయంకరంగా ఉంటాయి. మానవాళిపై అవి ఎంత ప్రభావం చూపుతాయో పూసగుచ్చినట్టు వివరించారు. ప్రపంచంలోని 22 మంది ప్రముఖ నిపుణులు ఈ సదస్సులో పాల్గొన్నారు. జీవ వైవిధ్యం, మహమ్మారిపై చర్చించారు.

ప్రకృతిలో 5,40,000 నుంచి 8,50,000 తెలియని వైరస్​లు ప్రజలకు సంక్రమిస్తాయని నివేదికలో పేర్కొన్నారు. ఫ్రెంచ్ గయానలో మాయరో వైరస్​ వ్యాధి వ్యాప్తి చెందిందని డబ్ల్యూహెచ్​వో నివేదించిన మూడు రోజుల తర్వాత ఈ నివేదిక రావడం గమనార్హం. కరోనా కంటే భయంకరమైన వైరస్​లో భవిష్యత్​లో మనుషులపై దాడిచేసే అవకాశం ఉన్నదని ఐపీబీఈఎస్​ నివేదిక తెలిపింది.వైరస్ దాడుల నుంచి తప్పించుకోవడం కూడా సాధ్యమేనని సదస్సు అభిప్రాయపడింది. వన్యప్రాణులు, సూక్ష్మజీవులు, పశుసంపద, ప్రజలమధ్య సంబంధాలు ఉండటంతో సూక్ష్మజీవులు వ్యాధులను వ్యాపింపజేస్తున్నాయని ఐపీబీఈఎస్​ నివేదిక తెలిపింది. వాతావరణ మార్పు, జీవవైవిధ్య నష్టానికి కారణమయ్యే మానవ కార్యకలాపాలు కూడా మహమ్మారి ప్రమాదాన్ని పెంచుతాయని నివేదిక అభిప్రాయపడింది.