Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్ క‌న్నా.. ష‌ర్మిల‌కే డ్యామేజీ ఎక్క‌వా?

By:  Tupaki Desk   |   29 Sep 2021 11:30 AM GMT
టీఆర్ ఎస్ క‌న్నా.. ష‌ర్మిల‌కే డ్యామేజీ ఎక్క‌వా?
X
రాజ‌కీయాల్లో ఎత్తులు మంచివే. అయితే.. ఒక్కొక్క సారి.. నేత‌లు వేసే ఎత్తుల‌కు ప్ర‌త్య‌ర్థులు, ప్ర‌త్య‌ర్థి పార్టీలు వేసే పై ఎత్తులు ఫ‌లిస్తే.. మొత్తానికే మోసం వ‌చ్చిన సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు ఇదే చ‌ర్చ‌.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి.. ష‌ర్మిల విష‌యంలోనూ జ‌రుగుతోంది. తెలంగాణ‌లో రాజ‌న్న రాజ్యం స్థాపిస్తానంటూ.. ష‌ర్మిల‌.. రాజ‌కీయ పార్టీ పెట్టుకున్నారు. అయితే.. ఆమె అరంగేట్రంపై అనేక అనుమానాలు ఉన్నాయి. ఆమెను బీజేపీనే రాజ‌కీయ గోదాలోకి లాగింద‌ని.. ఆమెవెనుక బీజేపీ పెద్ద‌లు ఉన్నార‌ని.. ఇప్ప‌టికీ.. చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే.. దీనిపై ఆమె ఎక్క‌డా పెద‌వి విప్ప‌రు.

ఇక‌, బీజేపీ నాయ‌కులు కూడా ష‌ర్మిల విష‌యంలో నోరు విప్ప‌రు. ఆమెను ఎక్క‌డా విమ‌ర్శించ‌రు. అదేమ ని అంటే.. అస‌లు ఆ పార్టీ ఉందా? అంటూ.. అమాక‌త్వం న‌టిస్తున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నారు. ఇక‌, ష‌ర్మిల కూడా బీజేపీపై పెద్ద‌గా నోరు చేసుకోరు. ఈ ప‌రిణామాలను గ‌మ‌నిస్తుంటే.. బీజేపీకి-ష‌ర్మిల‌కు మ‌ధ్య అవినాభావ సంబంధాలు ఎక్క‌డో ఉన్నాయ‌నేది అధికార పార్టీ విమ‌ర్శ‌. స‌రే! ఇప్ప‌టి వ‌ర‌కు అయితే.. దీనికి సంబంధించిన సంకేతాలు బ‌య‌ట‌కు రాలేదు. కానీ, ఇప్పుడు ష‌ర్మిల వేస్తున్న అడుగులు.. ఈ విష‌యాన్ని బ‌ల‌ప‌రుస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఎలాగంటే.. ష‌ర్మిల‌.. కొన్నాళ్లుగా టీఆర్ ఎస్ ప్ర‌భుత్వంపైనా.. సీఎం కేసీఆర్‌పైనా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అంతేకాదు.. వివిధ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ.. దీక్ష‌లు కూడా చేస్తున్నారు. అయితే.. వీటికి మైలేజీ వ‌చ్చిందా.. రాలేదా.. పెయిడా.. అనే చ‌ర్చ కూడా ఉంది. ఇక‌, ఇప్పుడు ఆమె.. ఏకంగా.. హుజూరాబాద్ వేదిక‌గా.. నిరుద్యోగ దీక్ష చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం ఇక్క‌డ ఉప ఎన్నిక వేడి రాజుకుంది. వ‌చ్చే నెల 30న‌న ఇక్క‌డ ఉప ఎన్నిక‌కు రంగం సిద్ధ‌మైంది. ఈ స‌మ‌యంలో ఇక్క‌డ నుంచి ష‌ర్మిల దీక్ష చేయ‌డం.. ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించడం.. చేయ‌డం వ‌ల్ల‌.. ఎవ‌రికి డ్యామేజీ జ‌రుగుతుంద‌నేది ఆస‌క్తిగా మారింది.

ఎందుకంటే.. హుజూరాబాద్ ఎన్నిక‌ను .. అధికార పార్టీ టీఆర్ ఎస్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. అదేస‌మ యంలో బీజేపీ కూడా అంతే స‌మానంగా ఇక్క‌డ ప్ర‌చారం చేస్తోంది. గెలిచి తీరాల‌నే త‌ప‌నతో ఉంది. అయితే.. సీఎం కేసీఆర్ అమ‌ల చేస్తున్న ద‌ళిత బంధు.. ప్ర‌జా సంక్షేమ కార్య‌క్ర‌మాలు.. బీజేపీకి ఒక‌ర‌కంగా .. ఇబ్బందిగా మారాయి. ఈ క్ర‌మంలో గెలుపుపై ఆశ‌లు ఉన్నా.. మెజారిటీ స‌హా.. ఇంకా కొన్ని సందేహాలు ఉన్నాయి. ఈ క్ర‌మంలో ఇప్పుడు ఇక్క‌డ ష‌ర్మిల అడుగు పెట్ట‌డం.. కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా దీక్ష చేప‌ట్ట‌డం ద్వారా.. ఏ కొద్దిపాటి ఓట్లు చీలినా.. అది బీజేపీకే ల‌బ్ధి చేకూరుతుంది. ఎందుకంటే.. ష‌ర్మిల పార్టీ ఇక్క‌డ పోటీ చేయ‌డంలేదు.

సో.. నిజంగానే ష‌ర్మిల‌కు ఏమాత్రం ఇమేజ్ ఉన్నా.. ప్ర‌భుత్వంపై ఆమె చేస్తున్న పోరాటం ద్వారా.. ఓట్లు క‌నుక చీలితే.. బీజేపీకే ప‌డ‌నున్నాయి. ఇది.. బీజేపీకి వ‌రంగా మార‌నుంది. అయితే.. ఈ విష‌యం ష‌ర్మిల‌కు తెలియ‌దా?? అంటే.. తెలిసే చేస్తున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇదంతా ఒక వ్యూహం ప్ర‌కారం జ‌రుగుతున్న‌దేన‌ని.. ఆమె దీక్ష చేయాలంటే.. హైద‌రాబాద్ స‌హా అనేక జిల్లాలు ఉన్నాయ‌ని.. కేవ‌లం ప‌నిగ‌ట్టుకుని ఎన్నిక‌ల షెడ్యూల్ వ‌చ్చాక ప్ర‌క‌టించ‌డం.. అంటే.. బీజేపీకి మేలు చేయ‌డంలో భాగ‌మేన‌ని.. అంటున్నారు. మ‌రి ఇదే జ‌రిగితే.. ఇప్ప‌టి వ‌ర‌కుకేవ‌లం చ‌ర్చ‌గా మాత్ర‌మే ఉన్న ష‌ర్మిల-బీజేపీ సంబంధాలు నిజ‌మేన‌ని స్ప‌ష్ట‌మ‌వుతాయి. అంతేకాదు.. అధికార పార్టీ కూడా దీనిని ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకువెళ్తుంది. అప్పుడు న‌ష్ట‌పోయేది.. ష‌ర్మిలా? కేసీఆరా? అనేది ప్ర‌శ్న‌.