Begin typing your search above and press return to search.

కొత్త ఏడాదికి సరే... ఒమిక్రాన్ కు స్వాగతం పలకకండి..!!

By:  Tupaki Desk   |   1 Jan 2022 4:20 AM GMT
కొత్త ఏడాదికి సరే... ఒమిక్రాన్ కు స్వాగతం పలకకండి..!!
X
కొత్త ఏడాది కి స్వాగతం ఇప్పుడే స్వాగతం పలికాము. ఇందుకు సంబంధించి ప్రజలందరూ ఎంతో ఆనందంతో , ఉత్సాహంతో వివిధ రకాలైన ఏర్పాట్లు చేసుకుని ఉంటారు. అందరూ ఒక చోట కూడి ఆనందంగా నూతన సంవత్సరాన్ని తమ దైన రీతిలో ఆహ్వానిస్తారు. అయితే ఒక్కొక్కరూ ఒక్కో విధంగా డిసెంబర్ 31 వ తారీకు రాత్రి ని ఎంజాయ్ చేస్తారు. కొందరు మద్యానికి ప్రాధాన్యత ఇస్తే, మరి కొందరు ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా తిరిగేందుకు ఆసక్తి చూపుతారు.

ఏదేమైనా సరిగ్గా పన్నెండు గంటలు అవ్వగానే అందరూ కలిసి హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కొత్త సంవత్సరాన్ని కొత్త ఆశలతో స్వాగతం పలుకుతారు. మరి కొంత మంది అయితే ఈ కొత్త సంవత్సరాన్ని స్వాగతం పలికేందుకు పబ్బులు, హోటల్స్ ను ముందస్తుగా బుక్ చేసుకుని వాటిలో ఎంజాయ్ చేస్తారు. అయితే ఇలాంటి వాటి వల్ల భవిష్యత్తులో ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని వైద్య ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆనందాన్ని కోల్పోవడంతో పాటు కరోనా వైరస్ జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

ప్రధానంగా వ్యక్తుల మధ్య భౌతిక దూరాన్ని పాటించడంతో పాటు మాస్కు ధరించడం ఇలాంటివి చేయాలని చెప్తున్నారు. అంతేకాకుండా కొత్త సంవత్సరం వేడుకల్లో రెండు టీకాలు తీసుకున్నవారు మాత్రమే పాల్గొనాలని సూచిస్తున్నారు. లేకపోతే కరోనా వైరస్ బారిన పడాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. దేశంలో వైరస్ రోజు రోజుకు పెరుగుతుందని గుర్తు చేసిన నిపుణులు.. రోజువారి కేసుల సంఖ్యను ఒకసారి పరిశీలించాలని అంటున్నారు.

ఈ ఒక్క రోజే భారత్లో సుమారు 16 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 200కు పైగా మంది వైరస్ కారణంగా మరణించారు. ఇదిలా ఉంటే కరోనా వైరస్ కొత్త వేరియంట్ కూడా రోజురోజుకు వ్యాపిస్తుంది. ఈ క్రమం లోనే జాగ్రత్తలు పాటించాలని వైద్య ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దేశంలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ కేసులు 1270 గా నమోదయినట్లు కేంద్రం ఆరోగ్యశాఖ తెలిపింది. అత్యధికంగా మహారాష్ట్రలో కొత్త వేరియంట్ కేసులు 450 నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఆ తర్వాతి స్థానంలో ఢిల్లీ ఉన్నట్లు పేర్కొంది.

ఇదిలా ఉంటే రోజురోజుకు కరోనా వైరస్ కొత్త వేరియంట్ కేసులు భారీస్థాయిలో వెలుగు చూస్తుండడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కలవరానికి గురి చేస్తోంది. ఇప్పటికే వివిధ దేశాల్లో క్రిస్టమస్ కారణంగా కేసుల సంఖ్య లక్షల్లో నమోదు అవుతుంది. ఈ నేపథ్యంలోనే భారత్లో కొత్త సంవత్సర వేడుకలు ఎక్కువ మంది పాల్గొంటే రానున్న రోజుల్లో మన దేశంలో కూడా వైరస్ కేసులు అమాంతం పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఈ సంవత్సరం కూడా నూతన సంవత్సర వేడుకలకు కాస్త దూరంగా ఉండటం మంచిదని చెబుతున్నారు.