Begin typing your search above and press return to search.

మ్యాచ్ కంటే బాల్ పైనే ఆసక్తి ..ఎందుకంటే ?

By:  Tupaki Desk   |   22 Nov 2019 9:45 AM GMT
మ్యాచ్ కంటే బాల్ పైనే ఆసక్తి ..ఎందుకంటే ?
X
క్రికెట్ లో టెస్ట్ మ్యాచ్ కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సాంప్రదాయ క్రికెట్ కి పెట్టింది పేరు టెస్ట్ మ్యాచ్. కానీ , ఈ ఫాస్ట్ యుగం లో వన్డే , t20 అంటూ ఫాస్ట్ క్రికెట్ వచ్చి టెస్ట్ మ్యాచ్ లకి ఉన్న ప్రాధాన్యతని తగ్గించేసాయి. కానీ, టెస్ట్ మ్యాచ్ లలో ఉండే ఆ మజానే వేరు. టెస్ట్ మ్యాచ్ ప్రతిష్ట రోజురోజుకి దిగజారుతున్న ఈ రోజుల్లో .. బీసీసీఐ అధ్యక్షుడు ..మాజీ ఇండియా టీం కెప్టెన్ సౌరవ్ గంగూలీ ..టెస్ట్ మ్యాచ్ లపై అందరికి ఆసక్తి కలిగేలా చేసారు.

ప్రస్తుతం బాంగ్లాదేశ్ , ఇండియా టెస్ట్ సిరీస్ జరుగుతోంది. ఇప్పటికే ఒక మ్యాచ్ గెలిచి ఇండియా సిరీస్ లో ముందంజలో ఉంది. ఈ సమయంలో బీసీసీఐ అధినేత ..డే అండ్ నైట్ టెస్టులకు తెర తీశారు. ఇప్పటి వరకూ టీమిండియా, పసికూన బంగ్లాదేశ్ ఒక్కసారి కూడా డే/నైట్ టెస్టు ఆడలేదు. దీంతో.. ఈ రెండు జట్లకీ గులాబీ బంతితో అదీ ప్లడ్‌లైట్ల వెలుగులో ఆడటం కొత్త అనుభూతినివ్వబోతోంది. ఇప్పటికే ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలు ఆ తరహా మ్యాచ్ లు ఆడినా.. టీమిండియా ను అటుగా పంపలేదు బీసీసీఐ. ఈ విషయంలో ఐసీసీ కూడా ఎవరినీ ఒత్తిడి చేయలేదు.

కానీ , బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలను సౌరవ్ గంగూలీ చేప్పట్టిన తరువాత అనేక మార్పులకి శ్రీకారం చుట్టారు. అందులో ఈ పింక్ బాల్ తో డే / నైట్ టెస్ట్ మ్యాచ్ కూడా ఒకటి. మామూలుగానే క్రికెట్ విషయంలో గంగూలీ అభిప్రాయాలను ఎవరూ అంత తేలికగా ఖండించలేరు. ఇక బీసీసీఐ అధినేత హోదాలో తీసుకున్న నిర్ణయం కావడంతో ఎదురు చెప్పేవారే లేరు. ఈ పింక్ బాల్ డే అండ్ నైట్ టెస్టును కోల్ కతా వేదికగా ఆడుతూ ఉంది టీమిండియా. బంగ్లాదేశ్ ప్రత్యర్థి. గంగూలీ నిర్ణయానికి బంగ్లా బోర్డు కూడా ఓకే చెప్పేసింది. తమ జట్టు చేత డే అండ్ నైట్ టెస్టును ఆడిస్తూ ఉంది. బంగ్లా ప్రస్తుత ఫామ్ చాలా దారుణంగా ఉంది. టీమిండియాకు పోటీ ఇస్తే అదే గొప్ప అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇక పింక్ బాల్ తో టెస్ట్ మ్యాచ్ కావడం తో కోల్ కత్తా మొత్తం పింక్ మయం అయిపోయింది. ఈ విషయాలన్నీ కాసేపు పక్కన పెడితే ..ఇప్పుడు ఆసక్తి అంతా.. మ్యాచ్ ఫలితం మీద కంటే .. డే అండ్ నైట్ టెస్ట్ అనేది అభిమానుల్లో ఎక్కువ ఆసక్తి రేపుతుంది? పింక్ బాల్ ఎలా స్పందిస్తుంది.. పరుగుల వరద పారి కొత్త ఆసక్తిని రేపుతుందా? తొలి సారి భారత క్రికెట్ అభిమానులు డే అండ్ నైట్ టెస్టు చూసి ఎలా ఫీలవుతారు? అసలు పింక్ బాల్ కి , రెడ్ బాల్ కి మధ్య తేడా ఏంటి ? అనే ప్రశ్నలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. కాగా ..ఇప్పటికే ఈ మ్యాచ్ ప్రారంభమైంది..