Begin typing your search above and press return to search.
24 గంటలు షాపులు తెరిచే జీవో పై మరింత క్లారిటీ వచ్చింది
By: Tupaki Desk | 10 April 2023 9:59 AM GMTరెండు రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని ప్రకటించటం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దుకాణాల్ని 24 గంటలు తెరుచుకునేలా ఆదేశాల్ని జారీ చేయటం.. దీనికి సంబంధించిన జీవో విడుదల కావటం తెలిసిందే.కొన్ని నిబంధనల్ని ఫ్రేం చేసి.. వాటిని ఫాలో అయ్యే వాణిజ్య సంస్థలు రూ.10వేలు ఏడాదికి అదనంగా కడితే 24 గంటలూ షాపులు తెరిచేందుకు వీలుగా అనుమతలు ఇవ్వనున్నట్లుగా పేర్కొన్నారు.
ఈ అంశం పై మరింత క్లారిటీ వచ్చేలా తాజాగా తెలంగాణ రాష్ట్ర కార్మికశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని వ్యాఖ్యలు చేశారు. 24 గంటలు షాపులు తెరిచే అంశం 1988 తెలంగాణ దుకాణాలు.. సంస్థల చట్టానికి లోబడి ఉంటుందని పేర్కొన్నారు. జీవో నెంబరు4 కింద ఇచ్చిన ఆదేశాల ప్రకారం రాష్ట్రంలోని అన్ని షాపులకు 24 గంటలూ తెరిచి ఉంచే నిబంధన వర్తించదని స్పష్టం చేశారు.
ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన తర్వాత మాత్రమే దుకాణాల్ని 24 గంటలూ నిర్వహించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అంతేకాదు తాజాగా విడుదల చేసిన 24 గంటలు షాపులు తెరిచి ఉండే జీవో నెంబరు 4 ఉత్తర్వులు ఎక్సైజ్.. ప్రొహిబిషన్ శాఖకు వర్తించదని క్లారిటీ ఇచ్చారు. వీటికి ఇప్పటికే ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రత్యేక సమయాలే వర్తిస్తాయని స్పష్టం చేశారు.
ఇదంతా చూస్తే 75శాతం డిస్కౌంట్ అంటూ దాని పైనే చిన్నగా షరతులు వర్తిస్తాయన్న రీతిలో కండీషన్స్ అప్లై అన్నట్లుగానే జీవో నెంబరు 4 వ్యవహారం ఉందన్న వాదన వినిపిస్తోంది. ఈ నిబంధన ప్రకారం చూస్తే కొన్ని వాణిజ్య సంస్థలు అది కూడా ప్రముఖ కంపెనీలకు చెందిన వాటికే అనుమతులు వస్తాయా? అన్నదిప్పుడు అనుమానంగా మారిందని చెప్పాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.