Begin typing your search above and press return to search.

యోగాతో ఎన్నో ప్రయోజనాలు ... నిషేధం ఎత్తేసిన అమెరికా !

By:  Tupaki Desk   |   17 March 2020 3:30 AM GMT
యోగాతో ఎన్నో ప్రయోజనాలు ... నిషేధం ఎత్తేసిన అమెరికా !
X
భారత దేశానికి యోగా ఓ అద్భుతమైన వరంగా భావిస్తారు. యోగా చేస్తే ఆరోగ్య లాభాల తో పాటుగా మానసిక ప్రశాంత కూడా ఉంటుంది. అలాగే మనిషి ఎంతో ఉల్లాసంగా, ఎంతో ఆరోగ్యంగా ఉంటాదానికి యోగా ఎంతగానో ఉపయోగ పడుతుంది. గత కొన్నేళ్ళుగా యోగా భారతీయ సాంప్రదాయంలో భాగమైంది . ఈ యోగాని ప్రయోగాత్మకం గా ఆస్వాదించిన ఎంతో మంది విదేశీయులు భారత్ లో నేర్చుకుని, ఆ తరువాత తమ తమ దేశాలలో ఈ యోగాని విస్తరించారు. ఇకపోతే ప్రతీ సంవత్సరం జూన్ 21 ని యోగా డే గా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు.

ఈ యోగా కోసం అగ్రరాజ్యం అమెరికా మొదలు అన్ని దేశాలు యోగా కోసం ప్రత్యేకమైన శిబిరాలు సైతం ఏర్పాటు చేస్తాయి. అయితే అమెరికా లో అలబామా రాష్ట్రం యోగాని వ్యతిరేకిస్తూ వచ్చింది.1993లో యోగాపై నిషేధాన్ని విధించింది . అయితే, ఈ నిబంధనను తొలగించాలంటూ డెమొక్రటిక్‌ పార్టీ సభ్యుడు జెరెమీ గ్రే గత వారం అలబామా ప్రతినిధుల సభలో యోగా బిల్లు ప్రవేశపెట్టగా..ఆ బిల్లు 84-17 ఓట్లతో పాసయింది. దాంతో దశాబ్దాల క్రితం యోగాపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసినట్లయింది.

రాష్ట్ర సెనేట్‌ లో గవర్నర్‌ కే ఇవే చేత ఆమోదం పొంది సంతకం చేస్తే అది చట్టంగా మారుతుంది. దీని తో 27 ఏళ్లుగా అన్ని అక్కడ యోగా పై ఉన్న నిషేధం తొలగిపోనుంది. ఇకపై ఈ రాష్ట్రంలో యోగాని జరుపుకోవచ్చు అంటూ ప్రకటించింది. అయితే కరోనా ఎఫెక్ట్ తో ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు నమస్తే పెట్టడాన్ని అలవాటు చేసుకుంటుంటే .. దాన్ని అలబామా రాష్ట్రం నిషేధం విధించింది.