Begin typing your search above and press return to search.

కరోనా క్యాకియా: చంద్రబాబుకు క్వారంటైన్ తప్పదట!

By:  Tupaki Desk   |   10 April 2020 10:00 AM IST
కరోనా క్యాకియా: చంద్రబాబుకు క్వారంటైన్ తప్పదట!
X
కరోనా వేళ.. బాధ్యతగల ప్రతిపక్ష నాయకుడు ఏం చేస్తాడు.. తన ప్రజల వద్ద ఉండి వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతాడు.. ఇంతటి ఆపత్కాలం వేళ ఏ నాయకుడైనా చేసే పని ఇదే.. అసలు ప్రతిపక్ష నేత అంటే ప్రజల మధ్యలోనే ఉండాలి. కానీ మన ఘనత వహించిన టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం.. ఏపీ ప్రజలను కరోనాకు వదిలేసి ఎంచక్కా హైదరాబాద్ వెళ్లి సెటిల్ అయిపోయారు. అక్కడే మీడియాతో ముచ్చటిస్తూ ఏపీ పరిస్థితులపై దిగజారి వ్యాఖ్యలు చేస్తున్నారన్న విమర్శలున్నాయి. హైదరాబాద్ లో ఉండి ఏపీ ప్రజల కోసం బాబు గారు పాటుపడడంపై అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

ఎంత మొత్తుకున్నా కానీ.. పరాయి రాష్ట్రంలో ఉండి బాబు గారి ప్రయత్నాలు ఏపీ జనాల చెవికి ఎక్కడం లేదు. ఆయన అరుపులు ఆయన సొంత మీడియాకు తప్పితే వేరే ఎవరికి వినసొంపుగా కనిపించడం లేదు.

చంద్రబాబు తాపత్రయంపై తాజాగా మంత్రి మోపిదేవి వెంకటరమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ జగన్ సర్కారు కరోనా వ్యాప్తిని చిత్తశుద్దితో అన్నిరకాల చర్యలు తీసుకుంటూ అదుపు చేస్తోందని.. తెలంగాణ నుంచి వచ్చిన వారిని 14 రోజులు క్వారంటైన్ లో ఉంచాక విడుదల చేస్తున్నామని తెలిపారు. కానీ హైదరాబాద్ లో కూర్చొని చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

ముందు చంద్రబాబు కరోనాకు భయపడకుండా ఆంధ్రప్రదేశ్ కు రావాలని మంత్రి మోపిదేవీ డిమాండ్ చేశారు. అయితే చంద్రబాబు వచ్చినా ముందుగా తెలంగాణ ప్రభుత్వం అనుమతి.. ఆ తర్వాత ఏపీలో 14రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుందని మంత్రి మోపిదేవీ స్పష్టం చేశారు.

దీంతో వైసీపీ సర్కారు రూల్స్ స్టిక్ట్ గా ఫాలో చేస్తామని.. చంద్రబాబును వదలకుండా ఏపీకొస్తే క్వారంటైన్ కు తరలిస్తామని మంత్రి మోపిదేవి హెచ్చరికలు జారీ చేశారు. మరి హైదరాబాద్ లో ఉన్న బాబుగారు క్వారంటైన్ కు వెళతారా? తెలంగాణలోనే ప్రచార ఆర్భాటంతో ఊగిపోతారా అన్నది తేలాల్సి ఉంది.