Begin typing your search above and press return to search.
మోడీకి ఆ ‘‘ముప్పు’’ ముంచుకొస్తోందట
By: Tupaki Desk | 30 Oct 2015 11:01 AM GMTబీజేపీ నేతల అత్యుత్సాహం ప్రధాని మోడీకి ఎంతటి ముప్పో అన్న విషయాన్ని ప్రముఖ రీసెర్చ్ సంస్థ మూడీస్ లెక్క కట్టేసింది. సొంత పార్టీ నేతల్ని కట్టడి చేయటంలో ప్రధాని మోడీ ఇక ఏ మాత్రం ఆలస్యం చేసినా అందుకు వాటిల్లే నష్టం భారీగా ఉంటుందని హెచ్చరించింది. మోడీని చూసి భారత దేశ ప్రజలంతా ఎంతో నమ్మకంతో ఎన్నుకుంటే.. అందుకు భిన్నంగా బీజేపీ నేతలు బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తున్నారని పేర్కొంది. బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల కారణంగా మోడీ పరపతి దారుణంగా దెబ్బ తింటోందని వార్నింగ్ ఇచ్చింది.
కమలనాథుల స్టేట్ మెంట్ల కారణంగా మోడీ పరపతి దారుణంగా దెబ్బతింటోందని అంచనా వేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో సొంత పార్టీ నేతల్ని మరెలాంటి ఆలస్యం చేయకుండా మోడీ కంట్రోల్ చేయాలని లేని పక్షంలో జరిగే నష్టం భారీగా ఉంటుందని తేల్చింది. ఈ విసయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా మోడీ.. దేశంలోనూ.. ప్రపంచంలోనూ తాను సంపాదించుకున్న పరపతి మొత్తం పోగొట్టుకున్న వారు అవుతారని పేర్కొంది. మరి.. మూడీస్ వార్నింగ్ ను మోడీ లక్ష్య పెడతారా?