Begin typing your search above and press return to search.
మోడీ ఉద్యోగులపై అంతర్జాతీయ సంస్థ ఫైర్
By: Tupaki Desk | 6 Nov 2015 7:15 AM GMTఅంతర్జాతీయ సంస్థలకు ప్రీతిపాత్రుడైన ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇపుడు అదే సంస్థలకు కంటగింపుగా మారారా? మోడీకి నచ్చే విధంగా అభిప్రాయాలు వెలువరించనంత మాత్రాన అంతర్జాతీయ సంస్థలకు విలువ ఉండదా? మోడీపై కీర్తిని పెంచాల్సిన అధికారులే ఆయన విలువ తగ్గేంచేలా వ్యవహరిస్తున్నారా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి.
బీఫ్ - మత సహానం ఇతరత్రా అంశాలపై చెలరేగుతున్న దుమారం వల్ల భారతదేశం విశ్వసనీయత కోల్పోతుందని ప్రధాని నరేంద్ర మోడీని అమెరికాకు చెందిన మూడీస్ అనలటిక్స్ ఇటీవల హెచ్చరించింది. 'ఇండియా ఔట్ లుక్' పేరుతో విడుదల చేసిన నివేదికలో ఈ మేరకు స్పష్టం చేసింది. ఆర్థిక వృద్ధి లక్ష్యాలను భారతదేశం సాధించాలంటే హామీ ఇచ్చిన సంస్కరణలను అమలుచేయాలని పేర్కొంది. నిస్సందేహంగా తాజా రాజకీయ పరిణమాలు భారతదేశ విజయాలను నిర్దేశిస్తాయని తెలిపింది. తన పార్టీ సభ్యులకు - మంత్రివర్గ సహచరులకు కళ్ళెం వేయడానికి చర్యలు తీసుకోని పక్షంలో భారత్ దేశీయంగా - విదేశీ పరంగా విశ్వసనీయతను కోల్పోయే ప్రమాదముందని ఆ నివేదిక మోడీని హెచ్చరించింది. అయితే దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం పూర్తి భిన్నంగా స్పందించింది.
మూడీస్ అనలిటిక్స్ లో పనిచేసే జూనియర్ అసోసియేట్ ఎకనామిస్ట్ వ్యక్తిగత అభిప్రాయమే నివేదిక రూపంలో వచ్చిందంటూ ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) వ్యాఖ్యానించింది. ఈ నివేదికను ప్రచురించినందుకు మీడియాను కూడా పీఎంఓ విమర్శించింది. ప్రధాన మంత్రి కార్యాలయం భిన్నంగా వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆ వ్యాఖ్యలను మూడీస్ అనలిటిక్స్ సంస్థ తిరస్కరించింది. భారతదేశ ఆర్థిక దృక్కోణం నుండి చూసి విశ్లేషించి ఇచ్చిన నివేదికే అని మూడీస్ స్పష్టం చేసింది. దేశంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు, దేశ ఆర్థిక పరిస్థితులపై వాటి ప్రభావాన్ని ఆ నివేదికలో పొందుపరిచామే తప్ప ఏ రాజకీయ ఎజెండాను లేదా దృక్పథాన్ని గానీ సమర్థించడం జరగలేదని మూడీస్ ప్రతినిధి స్పష్టం చేశారు. మొత్తంగా పీఎంఓ ఉద్యోగులు మోడీకి-మూడీస్ కు మధ్య చిచ్చుపెట్టారని పలువురు విశ్లేషిస్తున్నారు.