Begin typing your search above and press return to search.
ఆ జంటకు రూ.14వేల కోట్లు ఇవ్వాలన్న కోర్టు!
By: Tupaki Desk | 15 May 2019 5:50 AM GMTమన దగ్గర చట్టాలు ఉంటాయి కానీ వాటి పదును విషయంలో చాలానే సందేహాలు వ్యక్తమవుతుంటాయి. కొందరి నిర్లక్ష్యం నిండు ప్రాణాలైన వేళ.. తూతూ మంత్రంలా కాకుండా.. సదరు సంస్థ మూలాలు కదిలిపోయేలా షాకిచ్చే కఠిన నిబంధనలు కొన్ని ప్రాశ్చాత్య దేశాల్లో కనిపిస్తాయి. తాజాగా ఉదంతం కూడా అలాంటిదే.
ప్రముఖ పురుగుమందుల కంపెనీ బేయర్ కు ఒక కోర్టు ఇచ్చిన భారీ షాక్ దిమ్మ తిరిగేలా ఉంది. ఆ కంపెనీకి చెందిన రౌండప్ కలుపు మొక్కల నివారణి మందు కారణంగా తమకు క్యాన్సర్ వచ్చిందని ఒక జంట కోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన కోర్టు.. సదరు జంటకు రూ.14వేల కోట్ల భారీ మొత్తాన్ని పరిహారంగా చెల్లించాలని పేర్కొంది.
ఎందుకిలా అంటే.. బేయర్ కు చెందిన మోన్ శాంటో అగ్రి కంపెనీకి చెందిన రౌండప్ కలుపు మొక్కల నివారిణిని వినియోగించటం ద్వారా తమకు క్యాన్సర్ బారిన పడినట్లుగా ఆక్లాండ్ లోని ఒక జంట కోర్టును ఆశ్రయించింది. రౌండప్ మీద గతంలోనూ ఇలాంటి ఆరోపణలు భారీగానే ఉన్నాయి. గ్లైఫోసేట్ ఆధారిత తమ ఉత్పత్తికి.. క్యాన్సర్ కు ఎలాంటి సంబంధం లేదని మోన్ శాంటో వాదించినా కోర్టు మాత్రం ఆ వాదనను వినిపించుకోలేదు.
ఇప్పటికి ఈ ఉత్పత్తికి సంబంధించి కోర్టును ఆశ్రయించిన బాధితులకు చెందిన మూడు కేసుల్లో కంపెనీ ఓటమిపాలైంది. ఈ తీర్పు చరిత్రాత్మకమని పిటిషన్ తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. అయితే.. ఈ తీర్పును తాము సవాల్ చేయనున్నట్లుగా బేయర్ ఒక ప్రకటనలో పేర్కొంది.