Begin typing your search above and press return to search.

కోతులను నెత్తిన పెట్టుకున్నారు.. 32 ఎకరాల భూమి ఇచ్చి మరీ సాకారు..

By:  Tupaki Desk   |   18 Oct 2022 2:30 AM GMT
కోతులను నెత్తిన పెట్టుకున్నారు.. 32 ఎకరాల భూమి ఇచ్చి మరీ సాకారు..
X
ఇప్పుడు ఎక్కడ చూసినా అడవుల్లో ఉండాల్సిన కోతులన్నీ వచ్చి గ్రామాలు, నగరాలపై పడి ఇంట్లో దూరి నానా హంగామా చేస్తున్నాయి. అడవుల్లో తినేందుకు ఏమీ దొరకకపోవడం..తాగేందుకు నీరు లేక అవన్నీ జనవాసాలపై పడుతున్నాయి.

ఇదంతా మనం చేసిన పాపమే. కోతులు రెచ్చిపోయి మరీ జనాలపై దాడులు చేస్తున్న రోజులివీ. అయితే ఇక్కడ ఒక గ్రామం మాత్రం కోతులను నెత్తిన పెట్టుకుంది. కోతుల పేరుతో ఏకంగా 32 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేసి మరీ వాటికి ప్రాధాన్యతినిచ్చింది.

మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలోని ఓ గ్రామంలో మనుషుల పేరు మీద కాకుండా కోతుల పేరు మీద ఏకంగా 32 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ చేయడం సంచలనమైంది. ఉప్లా గ్రామంలో కోతుల పేరు మీద భూమి రిజిస్ట్రేషన్ ఉండడం ఆశ్చర్యపరుస్తోంది. ఆ గ్రామంలో నివసిస్తున్న కోతులు ఆ భూములకు యజమానులుగా తీర్చిదిద్దారు.

ఈ భూమిని ఎవరు కోతుల పేరుమీద రిజిస్ట్రేషన్ చేశారో తమకు తెలియదని.. అది ఎప్పుడు జరిగిందో తెలియదు అని గ్రామ సర్పంచ్ అంటున్నాడు. కోతులపై మాత్రం తమ గ్రామంలో ఎనలేని అభిమానం ఉందని.. ఆహారం పెట్టి మరీ కోతులను సాకుతున్నారని తెలిపారు.ఇళ్లలో శుభకార్యాలు జరిగినా కోతులకు బహుమానాలు అందజేస్తున్నారని అంటున్నారు.

అయితే వీరి గ్రామ పూర్వీకులు ఎవరో ఇలా కోతులపై ప్రేమతో ఇలా రిజిస్ట్రేషన్ చేసి ఉంటారని గ్రామస్థులు చెబుతున్నారు. ఒకప్పుడు గ్రామంలో పెద్ద సంఖ్యలో కోతులు ఉండేవని.. వాటి కోసం 32 ఎకరాల భూమిని గతంలో ఫారెస్ట్ అధికారుల సూచనతో కేటాయించి పెద్ద మొత్తంలో మొక్కలు నాటి కోతులకు వదిలిపెట్టినట్టు ఆ గ్రామ సర్పంచ్ చెబుతున్నాడు. ఇప్పటికీ కబ్జా కాకుండా ఆ కోతులకే ఆ భూమి రిజిస్ట్రర్ అయ్యి ఉందని.. కోతులకు ఆవాసంగా నిలిచిందని చెబుతున్నారు.

ఇలా కోతుల కోసం 32 ఎకరాలు కేటాయించడం.. వాటికి ఆహారంగా పండ్ల చెట్లు పెంచి మరీ పోషిస్తున్న ఈ గ్రామం ఇప్పుడు వార్తల్లో నిలిచింది. గ్రామస్థుల ప్రేమకు అందరూ ఫిదా అయిపోతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.