Begin typing your search above and press return to search.

ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కలవరం.. 120 కేసులు నమోదు

By:  Tupaki Desk   |   22 May 2022 9:03 AM GMT
ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కలవరం.. 120 కేసులు నమోదు
X
21వ శతాబ్ధంలో మనిషిపై వైరస్ ల దాడి ఎక్కువైంది. కరోనాతో మొదలైన దాడులు కొత్తకొత్తగా రూపాంతరం చెందుతూ విరుచుకుపడుతూనే ఉన్నాయి. కరోనా తగ్గి ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న ప్రపంచాన్ని మరో వైరస్ భయపెడుతోంది.

ప్రస్తుతం ప్రపంచ దేశాలను 'మంకీపాక్స్' వైరస్ కలవరపెడుతోంది. బ్రిటన్ లో వెలుగుచూసిన ఈ వైరస్ నెమ్మదిగా ఇతరదేశాలకు విస్తరిస్తోంది. ఇప్పటికే 120కి పైగా కేసులు నమోదయ్యాయి. మరిన్ని కేసులు పరిశీలనలో ఉన్నాయి. దాంతో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

మే 7న బ్రిటన్ లో ఓ వ్యక్తిలో మంకీపాక్స్ వైరస్ ను కనుగొన్నారు. నైజీరియా నుంచి బ్రిటన్ కు వచ్చిన వ్యక్తిలో వైరస్ బయటపడింది. అప్పటి నుంచి బ్రిటన్ లో కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పుడు ఏకంగా 20కి ఆ సంఖ్య చేరుకుంది. స్పెయిన్ లోనూ ఇప్పటివరకూ 23 కేసులు వెలుగులోకి వచ్చాయి. బ్రిటన్, స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, స్వీడన్, కెనడా, అమెరికాలో మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. తాజాగా బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా కూడా ఈ కేసుల జాబితాలో చేరిపోయాయి.

యూకే, అమెరికా, కెనడా, స్పెయిన్, పోర్చుగల్ దేశాల్లో పదుల సంఖ్యలో మంకీ పాక్స్ వైరస్ కేసులు నమోదయ్యాయి. కోతులు, ఎలుకలు, ఉడుతల ద్వారా వ్యాపించే ఈ వైరస్.. యూకేలో శృంగారం ద్వారా కూడా సోకుతుందని.. ముఖ్యంగా గే లేదా బైసెక్సువల్ మెన్ ల ద్వారా ఇది వ్యాపించడం ఆందోళన కలిగిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఈ వైరస్ సోకితే తలనొప్పి, చలి, కండరాల నొప్ప లాంటి లక్షణాలుంటాయి.

మంకీపాక్స్ పలు దేశాల్లో వెలుగుచూడడం ఆందోళన కలిగిస్తోంది. కెనడాలో డజనుకు పైగా మంకీపాక్స్ అనుమానిత కేసులు బయటపడ్డాయి. తాజాగా అమెరికాలోనూ మంకీ పాక్స్ తొలి కేసు నమోదైంది. ఇటీవల కెనడా నుంచి వచ్చిన ఓ వ్యక్తికి ఈ వైరస్ నిర్ధారణ అయినట్లు అమెరికా బుధవారం ప్రకటించింది.

కెనడా క్యూబెక్ ప్రాన్సుల్లో 12కు పైగా అనుమానాస్పద మంకీపాక్స్ కేసులను గుర్తించి చికిత్స అందజేస్తున్నారు. ఈ వారం ప్రారంభంలో ఐరోపా ఆరోగ్య అధికారులు డజన్లకొద్దీ మంకీపాక్స్ కేసులను గుర్తించారు.

మంకీపాక్స్ కేసు వల్ల ఇప్పటికప్పుడు ప్రజలకు వచ్చేప్రమాదం ఏం లేదని.. ఐసీయూల్లో చికిత్స కొనసాగుతోందని.. ఆరోగ్యాలు నిలకడగా ఉన్నాయని అమెరికా సీడీసీ పేర్కొంది.

ఈ వైరస్ సోకిన వ్యక్తికి వచ్చిన పుండ్ల వల్ల.. లైంగిక చర్యల వల్ల ఇతరులకు ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందని మసాచుసెట్స్ ఆరోగ్య అధికారులు తెలిపారు. వ్యాధి బారినపడ్డ వారు ఉపయోగించిన వస్తువులను వాడినా వైరస్ సోకే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. దీనికి చికెన్ పాక్స్ లక్షణాలే ఉంటాయని తెలిపారు.

గత రెండు వారాలుగా ఐరోపాలోని పోర్చుగల్, స్పెయిన్, బ్రిటన్ లో బయటపడ్డ అసాధారణ డజన్ల కొద్దీ మంకీపాక్స్ కేసులకు అసహజ లైంగిక కార్యకలాపాలే కారణమని వైద్యులు తెలిపారు. ఐరోపా కేసుల్లో గే సెక్స్ వ్యక్తులకే ఇది సోకిందని.. లైంగిక ధోరణితో సంబంధం లేకుండా ఎవరికైనా మంకీపాక్స్ వ్యాప్తి చెందుతుందని వైద్య నిపుణులు తేల్చారు.

అసహజ శృంగారం వల్ల ఈ కొత్త వ్యాధులు వ్యాపిస్తున్నాయని తెలిసి అందరూ అవాక్కవుతున్నారు. ఈ ప్రపంచం ఎటుపోతుందని ఆవేదన చెందుతున్నారు. అసహజ తిండివల్లేనే కరోనా సోకింది. ఇప్పుడు అసహజ శృంగారంతో ఇది వ్యాపించడం అందరినీ కంగారుపెడుతోంది.