Begin typing your search above and press return to search.

బెజవాడలో మంకీ పాక్స్? ఏపీకి కొత్త టెన్షన్!

By:  Tupaki Desk   |   17 July 2022 11:30 AM GMT
బెజవాడలో మంకీ పాక్స్? ఏపీకి కొత్త టెన్షన్!
X
ఇప్పుడున్నవి సరిపోనట్టు ఏపీకి కొత్త టెన్షన్ పట్టుకుంది. కరోనా తర్వాత ప్రపంచంలోని పలు దేశాలకు టెన్షన్ పుట్టిస్తోంది మంకీ పాక్స్. ఇప్పటికే ఈ వైరస్ కు సంబంధించిన కేసులు కేరళలో నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా విజయవాడలో ఒక చిన్నారికి ఈ లక్షణాలు కనిపించినట్లు చెబుతున్నారు.

అయితే.. ఈ చిన్నారి కుటుంబం ఇటీవల దుబాయ్ నుంచి వచ్చినట్లు చెబుతున్నారు. చిన్నారి శరీరం మీద దద్దుర్లు రావటంతో వైద్యుల వద్దకు తీసుకెళ్లారు. దీన్ని గమనించిన వారు మంకీ పాక్స్ అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో.. ఆ పాప నమూనాల్ని సేకరించిన వైద్య శాఖ అధికారులు శాంపిల్స్ ను పరీక్షల కోసం ఫూణెకు పంపుతున్నారు.

ఇదిలా ఉంటే ఈ చిన్నారిని ప్రస్తుతం విజయవాడ ఓల్డ్ గవర్నమెంట్ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. ప్రస్తుతానికి చిన్నారి కుటుంబం మొత్తాన్ని ఐసోలేషన్ లో ఉంచారు. ఈ చిన్నారితోపాటు.. వారి కుటుంబానికి సంబంధించిన వివరాల్ని వైద్య అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. ఫూణెకు పంపిన శాంపిల్స్ ఫలితాలు వచ్చిన తర్వాత వివరాల్ని వెల్లడించే అవకాశం ఉందని చెబుతున్నారు.