Begin typing your search above and press return to search.
కరోనా మహమ్మారి ఒకవైపు..మంకీ ఫీవర్ మరోవైపు!
By: Tupaki Desk | 19 April 2020 12:00 AM ISTదేశ వ్యాప్తంగా రోజురోజుకి కరోనా మహమ్మారి ఉదృతి పెరిగిపోతుంది. ఈ కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయడానికి కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అహర్నిశలు కష్టపడుతున్నారు. ఇందులో భాగంగానే .. లాక్ డౌన్ ను అమలు చేస్తున్నాయి. ఈ కరోనా కి సరైన వ్యాక్సిన్ లేకపోవడంతో ..సామాజిక దూరం ఒక్కటే సరైన మార్గం అని భావించి , లాక్ డౌన్ ను దేశ వ్యాప్తంగా కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ఇలా ఒకవైపు కరోనా మహమ్మారి పై పోరాటం చేస్తుంటే ..మరోవైపు కోతి జ్వరం కర్ణాటకలో చాప కింద నీరులాగా వ్యాపిస్తోంది.
ఇప్పటికే కరోనా కేసులతో అక్కడి ప్రభుత్వం సతమతమవుతుంటే.. ఇప్పుడు కొత్తగా మంకీ ఫీవర్ ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రజలను మరింత భయపెట్టిస్తోంది. ఇప్పటివరకూ ఈ వ్యాధి రాష్ట్రంలోని 12 జిల్లాలకు వ్యాపించింది. సుమారు రెండు వందల కేసులు నమోదయ్యాయి. గత ఆదివారం ఉత్తరకన్నడ జిల్లా సిద్ధాపుర తాలూకాలోని కూలర్క గ్రామంలో 41 కేసులు వెలుగు చూశాయి. చిక్క మంగళూరు 10, శివ మొత్త జిల్లాలో ఏకంగా 146 కేసులు నమోదవడంతో.. అక్కడ కలకలం సృష్టిస్తోంది. దీంతో కరోనా మహమ్మారితో పాటుగా ..ఈ మంకీ జ్వరం పై కూడా వైద్యులు ప్రత్యేక దృష్టి పెట్టారు. వరుసగా నాలుగు రోజులు జ్వరం వస్తే.. వెంటనే డాక్టర్లను సంప్రదించాలని అక్కడి ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఇకపోతే ఇప్పటివరకు కర్ణాటక లో 359 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగ ..13 మంది కరోనా తో మరణించారు.